ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మదన్ అస్వస్థతలో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు. "ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న మదన్ "పెళ్లైన కొత్తలో" సినిమాతో దర్శకుడిగా మారారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ఈయన స్వస్థలం. "గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం" చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన "గాయత్రి" మదన్ చివరి చిత్రం. మదన్ రాత్రి 1.41 గంటలకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. మదన్ మరణ వార్తపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మదన్ అంత్య క్రియలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం లో జరుగుతాయి. మదన్ దర్శకత్వం వహించిన ‘పెళ్లైన కొత్తలో’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన నటి ప్రియమణి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.