వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలతో పాటు 'ఎఫ్3'లో కొన్ని కొత్త క్యారెక్టర్లు కనిపించాయి. పూజాహెగ్డే ఐటెం సాంగ్ కూడా చేసింది. మే 27న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది.

 

ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. దీంతో చిత్రబృందం సినిమా హిట్ అంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అన్నీ సీరియస్ సినిమాలే రిలీజ్ అవ్వడం కూడా 'ఎఫ్3'కి కలిసొచ్చింది. లాజిక్స్ లేని ఈ కామెడీ ఎంటర్టైనర్ ను బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. 

 

ఇదిలా ఉండగా.. ఈ సినిమా థియేట్రికల్ రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని చెబుతోంది చిత్రబృందం. లేటెస్ట్ గా అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఉన్న వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. వీరు ముగ్గురూ కలిసి 'ఎఫ్3' సినిమా నాలుగు వారాల్లో ఓటీటీలోకి రాదని.. ఎనిమిది వారాల తరువాతే ఓటీటీలోకి వస్తుందని చెప్పారు. కాబట్టి థియేటర్లో సినిమాను చూసి ఎంజాయ్ చేయాలంటూ చెప్పుకొచ్చారు.