Jabardasth Latest Promo: బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఓ రేంజిలో ఎదురుచూస్తుంటారు. ఆయా టీమ్ లు చేసే ఫన్ చూసి పడీ పడీ నవ్వుతారు. ఎప్పటి లాగే ఈవారం కూడా ‘జబర్దస్త్’ షో ప్రేక్షకులను బాగా అలరించబోతోంది. తాజాగా విడుదలైన ప్రోమో అందిరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. షో ప్రారంభం కాగానే, బుల్లెట్ భాస్కర్ పంచులు, రాఘవ రివర్స్ పంచులు నవ్వుల పువ్వులు పూయించాయి.  


అండర్ వేర్ మీద బుల్లెట్ భాస్కర్ పేరు


“రాఘవ గారు ఈసారి బట్టలు కొనేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్ వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమ్మాన్యుయేల్ పేర్లు రాసుకుంటే బాగుంటుంది” అని బుల్లెట్ భాస్కర్ అంటారు. ‘సారీ అండీ ఆల్రెడీ అండర్ వేర్ మీద మీ పేరు రాశాను” అని రాఘవ చెప్పడంతో అందరూ పడీ పడీ నవ్వుతారు. 


ముందు కక్కు, తర్వాలే కల్యాణం


ఇక ఆటో రాం ప్రసాద్ దొరబాబు చేసిన కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. “కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు. ఈ రోజుల్లో ముందు కక్కే వస్తుంది. ఆ తర్వాతే కల్యాణ్ అవుతుంది” అని ఆటో రాం ప్రసాద్ చెప్పడంతో  అందరూ నవ్వుతారు. ఇక “రష్మి కట్టుకునే లాంటి శారీలు కావాలి” అని రోణినిని శాంతి అడగడంతో చిన్న గుడ్డ ముక్కను ఇస్తుంది. “ఇదేంటి ఇంతే ఉంది?” అంటుంది శాంతి. “మరి రష్మి కట్టుకునేది ఇంతే ఉంటుంది” అని రోహిణి చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోతారు.


లేనివాడు ఉన్నవాడు.. ఉన్నవాడు లేనివాడు!


ఇక నూకరాజు నాటీ నరేష్ గురించి చేసిన కామెంట్స్ అందిరినీ నవ్విస్తాయి. “ఉన్నవాడు లేని.. లేని వాడు ఉన్నవాడు అవుతాడు” అంటూ నూకరాజు చెప్తాడు. “ఉన్నవాడు లేని వాడు ఎలా అవుతాడు” అంటూ నూకరాజు భార్య అడుగుతుంది. “నరేష్ గాడికి ఇల్లు ఉంది. 3 ఎకరాల పొలం ఉంది. వాడు ఉన్నవాడు. అయినా లేని వాడు అనడంతో అందరూ నవ్వుతారు.


ఆకట్టుకున్న ‘డీజే టిల్లు’ పేరడీ సాంగ్


ఇక ‘డీజే టిల్లు’ పాటకు రాకెట్ రాఘవ పాడిన పేరడీ సాంగ్ ఆకట్టుకుంటుంది. రాఘవ టీమ్ మెంబర్స్ చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ అదరినీ ఆకట్టుకుంటుంది. “మీరు నాకు ఓటేస్తే సర్పంచ్ గారి తాలూకు అని అని చెప్పుకోవచ్చు” అంటాడు టీమ్ మెంబర్. “నువ్వేమైనా పవన్ కల్యాణ్ అనుకున్నావేంట్రా, పలానా తాలూకు అని చెప్పడానికి” అంటూ రాఘవ చేసిన ఫన్ అందరినీ ఆకట్టుకుంటుంది. 



బుల్లెట్ భాస్కర్ భార్యల పంచాయితీ


ఇక బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్ కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. నరేష్ ప్రోద్భులంతో బుల్లెట్ భాస్కర్ సత్యశ్రీని పెళ్లి చేసుకుంటాడు. “ఎంత బాడీ ఉన్నా, ఆ విషయం అంటే నాకు భయం” అంటాడు భాస్కర్. “తిప్పతీగ తీసుకుంటే రేసుగుర్రంలా మారిపోతావ్” అని చెప్తాడు నరేష్. ఇంతలోనే ఫైమా భాస్కర్ తన భర్త అంటూ సత్యశ్రీతో గొడవపడటం ఫుల్ ఫన్ కలిగిస్తుంది. ఇక ఇమ్మాన్యుయేల్, వర్షా టీమ్ చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది.  



Read Also: ఆసక్తి పెంచుతున్న నాని కొత్త సినిమా పోస్టర్‌ - ఏ మూవీ అప్‌డేట్‌ ఇది! ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఆ రోజే