రీసెంట్ గా 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అక్కినేని నాగచైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలైలో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

 

రిలీజ్ డేట్ చెప్పనప్పటికీ ప్రమోషన్స్ మాత్రం మొదలుపెట్టేసింది 'థాంక్యూ' టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ సినిమాలో మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఏంటో ఏంటేంటో' అంటూ సాగే ఈ పాటను జోనితా గాంధీ ఆలపించారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ మెలోడీ నాగచైతన్య, మాళవిక నాయర్ ల మధ్య సాగే సాంగ్ అని తెలుస్తోంది. 

 

వారిమధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలను ఈ లిరికల్ సాంగ్ లో చూపించారు. ఇక ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.