యాక్సిడెంట్ ఎవరు చేశారు అని ఏమైనా అనుకుంటున్నారా అని ఆయన అడిగారని కాంచన చెప్తుంది. వేద, యష్ చాలా కోపంగా అభిమన్యు ఇంటికి వస్తారు. కారు కోసం వెతుకుతారు కానీ కనిపించదు. ఇంట్లోకి వెళ్ళి అభిమన్యు, ఖైలాష్ బయటకి రండి అని అరుస్తాడు. నీ కారు, ఆ ఖైలాష్ గాడు ఎక్కడ అని అడుగుతాడు. నాకు మొత్తం తెలిసిపోయిందని యష్ అంతడు. మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది మీరే ఆ ఖైలాష్ కారుతో మా అమ్మని గుద్దేశాడు అని వేద కోపంగా చెప్తుంది. ఖైలాష్ మీ అమ్మని గుద్దడం ఏంటి అని మాళవిక అడుగుతుంది. యాక్సిడెంట్ చేసిన కారు ఎక్కడ దాచి పెట్టారో చెప్పమని వేద అడుగుతుంది.


యష్: యాక్సిడెంట్ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదె లేదు.. కేసు పెట్టి అందరినీ లోపల వేయిస్తాను


మాళవిక: అంతా మీరు అనుకుంటే సరిపోతుందా, సాక్ష్యాలు ఉన్నాయా


అభిమన్యు: మీ అమ్మకి ఖైలాష్ యాక్సిడెంట్ చేశాడానే దానికి ప్రూఫ్ ఏంటి, ఖైలాష్ చేత మేమే చేయించామని మీ దగ్గర రుజువులు ఉన్నాయా


మాళవిక: ఇదంతా ట్రాష్.. నిన్ను ఇరికించడానికి ఇదొక కొత్త డ్రామా


అభి: ఖైలాష్ ఇప్పుడు నా దగ్గర ఉండటం లేదు వారం రోజులైంది వాడిని చూసి, నీకు దమ్ముంటే వాడిని తీసుకొచ్చి ప్రూవ్ చేయి


యష్: ప్రూఫ్స్ తో వచ్చి దీని వెనుక ఎవరు ఉన్నారో తేలుస్తాను, జైలుకి వెళ్ళి చిప్ప కూడు తినడానికి రెడీ గా ఉండు


అభి: నన్ను జైలికి పంపించడం నీ అబ్బ తరం కూడా కాదు


యష్: వస్తాను త్వరలోనే మళ్ళీ వస్తాను.. నిన్ను జైలుకి పంపించడం ఖాయం


Also read: పోటాపోటీగా దాండియా ఆడిన సామ్రాట్, తులసి- అవమానించిన అమ్మలక్కలు, ఆగ్రహంతో ఊగిపోయిన అనసూయ


సులోచన దగ్గరకి ఖుషి వచ్చి మాట్లాడుతూ ఉంటే మాలిని కూడా వస్తుంది. నువ్వు మాట్లాడలేవు కదా అందుకే నిన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాను ఏయ్ పొట్టి బుడంకాయ్ లేచి తిట్టవే అని కావాలని అంటుంది. ఆ మాటలకి సులోచన మాట్లాడేందుకు ట్రై చేసి పిప్పళ్ల బస్తా అని మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. ముద్దపప్పు నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంది తిట్టు ముద్దపప్పు నాకు నా పాత శత్రువు కావాలి అని ఎమోషనల్ అవుతుంది.


యష్ కి తన ఫ్రెండ్ ఫోన్ సూర్య ఫోన్ చేస్తాడు. వాళ్ళ మ్యారేజీ డే అని పార్టీకి రావాల్సిందే అని చెప్తాడు. అత్తయ్యగారికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు తింటున్నావో నిద్రపోతున్నావో కూడా పట్టించుకోవడం లేదు. నీకు రీఫ్రెష్ మెంట్ కావాలి అందుకే కాస్త బయటకి వెళ్తే నీ మూడ్ అయినా మారుతుందని యష్ చెప్తాడు. నేను కాదు మీరు రీఫ్రెష్ అవ్వడం ముఖ్యం మీ కోసం అయినా నేను ఆ పార్టీకి వస్తాను అని చెప్తుంది. వేద, యష్ ఇద్దరూ కలిసి పార్టీకి వెళతారు. అదే పార్టీకి మాళవిక కూడా వస్తుంది. అప్పటి వరకు తనతో మాట్లాడిన వాళ్ళు అంతా మాళవికని చూసి తన దగ్గరకి వెళ్లిపోతారు.


Also Read: మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన భాగ్యమ్మ- ఆదిత్య, సత్య మధ్య రుక్మిణి ఉందని దేవుడమ్మకి తెలిసిపోతుందా?


తరువాయి భాగంలో..


అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ యశోధర్ భార్య స్థానం, ఖుషి అమ్మ స్థానం నాదే, నువ్వు కేవలం ఆయావి మాత్రమే అని మాళవిక అంటుంది. ఆయా స్థానం కూడా గొప్పదే అందులో నాకు గొప్ప గౌరవం కనిపిస్తుంది. నువ్వు అమ్మ అంతే ఖుషి ఒప్పుకోదు, భార్య అంతే యష్ ఒప్పుకోదు, ముత్తైదువు అంతే సమాజం ఒప్పుకోదు మరి నువ్వు ఎవరు నీ స్థానం ఏంటి. నా దృష్టిలో నువ్వు ఒక ప్లాస్టిక్ పువ్వువి అని వేద గట్టిగా ఇచ్చిపడేస్తుంది.