బెడ్ రూమ్ గోడ మీద ‘హ్యపీ వెడ్డింగ్ యానివర్సరీ మిసెస్ న్యూసెన్స్; అని రాసి యష్ మురిసిపోతాడు. వేద కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. నువ్వే ఇంత ఎగ్జైట్ అవుతుంటే ఇంక వేద ఎంత ఎగ్జైట్ అవుతుందో తను ఇంకేం ప్లాన్ చేసిందోనని సంతోషంగా గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు. వేద ఇంకా రావడం లేదేంటి, నాకు సర్ ప్రైజ్ చేస్తుందని అనుకుంటే అసలు రాలేదేంటి మర్చిపోయిందా అనుకుని తన చేతిలోని బొకే బెడ్ మీదకి విసిరేస్తాడు. అటు విన్నీ ఇంట్లో ఉన్న వేద కూడా యష్ నే తలుచుకుంటూ బాధపడుతుంది. యష్ తన కోసం చూస్తూ సోఫాలో కూర్చుని అలాగే నిద్రపోతాడు. వేద కూడా విన్నీ ఇంట్లో నిద్రపోతుంది. అది చూసి విన్నీ సంబరపడిపోతాడు. వేదకి మెళుకువ వచ్చి చూసేసరికి విన్నీ ఎదురుగా ఉంటాడు. తనకి బాగానే ఉందని అనేసరికి వేద వెళ్ళిపోతుంది.


Also Read: రాజ్యలక్ష్మి పరువు గోవిందా, ధర్నాకి దిగిన దివ్య- బిజినెస్ డీల్ వద్దన్న నందు


సులోచన పూజ చేసుకోవడం కోసం పూలు కోసుకుంటూ ఉంటే అప్పుడు వేద ఇంటికి రావడం చూసి పిలుస్తుంది. ఇంత ఉదయాన్నే బయట నుంచి వచ్చావ్ ఎక్కడికి వెళ్ళావ్ అని అడుగుతుంది. విన్నీకి సడెన్ గా కడుపు నొప్పి వచ్చింది ఫోన్ చేస్తే వెళ్ళి వచ్చానని చెప్తుంది. ఈరోజు మీ పెళ్లి రోజు కదా రాత్రంతా ఇంట్లో లేవా అని అంటుంది. ఎమర్జెన్సీ కదా తెలిసి కూడా అలా అంటావ్ ఏంటని అంటుంది. అల్లుడు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు కదా ఈరోజు నువ్వు ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు. డాక్టర్ వి ఎమర్జెన్సీ కేసులు వస్తాయి కాదనను కానీ ఒక భార్యగా భర్త దగ్గర ఉండటం నీ బాధ్యత అని అంటుంది. వేద ఇంట్లోకి వెళ్ళేసరికి యష్ సోఫాలో బొకే పట్టుకుని అలాగే కూర్చుని నిద్రపోతూ ఉంటాడు. తర్వాత గోడ మీద పూలతో అందంగా అలకరించింది చూసి చాలా సంతోషిస్తుంది.


‘ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు, నా కోసం ఎదురుచూసీ చూసి పడుకున్నారు. నా రాకతో మీ జీవితంలో సంతోషం వెలుగు వచ్చాయని అందరూ అనుకుంటున్నారు. మీ వల్లే నా జీవితానికి అర్థం, అమ్మతనం వచ్చాయి. నాకు మీరు ఎంతో ఇష్టమైన అమ్మతనాన్ని కూడా ఇచ్చారు. ఖుషితో నేను అమ్మ అని పిలిపించుకోవడంలో ఎంత ఆనందం పొందుతున్నానో మీ భార్యగా కూడా అంతే ఆనందం పొందుతున్నా. ఇదంతా మీ వల్లే మన పెళ్లై సంవత్సరం అయ్యిందంటే నమ్మలేకపోతున్నా. మన మధ్య ఎన్ని గొడవలు వచ్చిన ప్రతి రోజు క్షణంలా గడిచిపోయేది. మీతో నా బంధం చిరకాలం ఎన్నెన్నో జన్మలబంధంగా ఉండాలని కోరుకుంటున్నా’నని యష్ చేతిని ముద్దాడుతుంది. బొకే తీసుకుని హ్యపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీవారు అంటుంది. ఖుషి పాయసం చేస్తుంటే  అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు.


Also Read: శోభనానికి ఒప్పుకుని రాజ్ కి ఝలక్ ఇచ్చిన కావ్య- పట్టాలెక్కిన మరో ప్రేమ జంట


ఖుషి చేసిన పాయసం ఫస్ట్ తన డాడీనే టెస్ట్ చేయాలని అంటుంది. అది విని వేద బుంగమూతి పెడుతుంది. డాడీ నన్ను మెచ్చుకుని గిఫ్ట్ ఇస్తారు. డాడీ నాకు కిస్ ఇస్తారు కదా అది నీకు ఇప్పిస్తాలే మమ్మీ అంటుంది. తనకేం వద్దని వేద అంటే అలా అంటుంది కానీ మొన్న డాడీ కిస్ చేస్తే చాలా సంతోషించిందని చెప్తుంది. అప్పుడే యష్ వచ్చి ఖుషి తల్లి చేసిన పాయసం ఎక్కడా అని వచ్చి తింటాడు. తన కూతురి దగ్గర పాయసం నేర్చుకోమని అద్భుతంగా ఉందని మెచ్చుకుంటాడు.