మాళవిక రోడ్డు మీద వెళ్తుంటే చూసి అభిమన్యు ఆగుతాడు. పలకరిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నావ్ ఏంటి బంగారం కొంపదీసి నిన్ను పడేయడానికి వెంట పడుతున్నాను అనుకున్నావా ఏంటి? నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది. నీ పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది ఏంటని అంటాడు. నువ్వు కోరుకున్నది ఇదే కదా.. ఎందుకు అలా చేశావ్? నేను నీకు ఏం అన్యాయం చేశాను. అయినా నా కూతుర్ని కిడ్నాప్ చేసింది నువ్వే కదా? నాకు నువ్వు తప్ప శత్రువులు ఎవరూ లేరు ఎందుకు ఇలా చేశావని చొక్కా పట్టుకుంటుంది. నాకు అన్యాయం చేశావ్ వదిలేశా నా పిల్లల జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తానని వార్నింగ్ ఇస్తుంది. యష్ కూడా ఇలాగే ఇంటికి వచ్చాడు నేను కాదని తెలుసుకుని వెళ్ళిపోయాడు.
అభి: నువ్వు ఒకప్పుడు డబ్బు కోసం నా దగ్గరకి వచ్చేశావు, ఇప్పుడు నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావ్ ఏంటి
మాళవిక: నేను రాలేదు నువ్వు డబ్బు ఆశ చూపించి వచ్చేలా చేసుకున్నావ్
Also Read: బసవయ్య చెయ్యి విరిచేసిన దివ్య- తులసిని తనకి తోడుగా ఉండమన్న నందు
అభి: మోసం చేసే వాళ్ళు ఉంటే నాలాంటి వాళ్ళు బోలెడు మంది ఉంటారు. మనం ఇద్దరం ఒకే జాతి వాళ్ళం ఒకరికోకరం వేలెత్తి చూపించుకోకూడదు. నా దగ్గర నుంచి వెళ్లిపోయాక యష్ తో సెటిల్ అయిపోవాలని ఆలోచన వచ్చి ఉంటుంది. కానీ అది కల్లో కూడా జరగదు. అయినా వేద ఉండగా నువ్వు కోరుకున్న చోటు దక్కుతుందని ఎలా అనుకుంటున్నావ్. ఎన్ని చెప్పినా నీ ప్రయత్నాలు మానవు సరే కానివ్వు చూడటానికి బాగుందిలే
పూజ చేసేందుకు యష్ పంచే కట్టుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటే వేద వచ్చి హెల్ప్ చేస్తుంది. కానీ యష్ మాత్రం పెళ్ళాం అందం చూసి మైమరిచిపోయి తనని పట్టుకోవాలని చూస్తాడు. యష్, వేద సంతోషంగా ఉండటం చూసి రగిలిపోతుంది. పూజలో తల్లి స్థానంలో తను కూర్చోవడానికి మాళవిక కాంచన మైండ్ పొల్యూట్ చేసేందుకు రెడీ అయిపోతుంది.
మాళవిక: నా పిల్లల కోసం జరిగే పూజలో నేనే కూర్చోలేకపోతున్నా. ఖుషి అసలు నన్ను తల్లిగా కూడా అనుకోవడం లేదు. ఏదో ఒకరోజు ఆదిత్య కూడ దూరం అయిపోతాడని అనిపిస్తుంది. నా పిల్లల కోసం జరిగే పూజ కదా నన్ను కూర్చోబెడతారా?
కాంచన: ఎవరో కూర్చోబెట్టడం ఏంటి నువ్వే కూర్చోవాలి అది శాస్త్రం
మాళవిక: నన్ను ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు
Also Read: మురారీ ప్రపోజల్ ప్రయత్నాలన్నీ తుస్- ఫోటోస్ పంపించిన ముకుంద
కాంచన: ఎవరో ఎందుకు నేనే చెప్తున్నా పూజలో నిన్ను కూర్చోబెట్టే బాధ్యత నాది అనేసరికి ఇప్పుడు ఈ సింపతీ కావాలి. ఈ ఇంట్లో ఒక వికెట్ నాకు పడితే ఇంట్లో నేను ఏది అనుకున్న అది జరుగుతుందని మనసులో అనుకుంటుంది. ఇంట్లో హోమం జరుగుతున్న దగ్గర య్ ఏర్పాట్లు చూస్తూ సులోచన, మాలిని కాసేపు పోట్లాడుకుంటారు. ఆదిత్య పూజ కోసం పంచే కట్టుకుంటే అచ్చం యష్ లానే ఉన్నాడని వేద మెచ్చుకుంటుంది. యష్ కొడుకు యష్ లానే ఉంటాడు కదా అని అంటుంది.