వేద, యష్ ఇద్దరూ ఖుషిని తీసుకుని గుడికి వస్తారు. అమ్మమ్మ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మీరిద్దరూ చాలా టెన్షన్ పడ్డారు అది చూసి చాలా బాధపడ్డాను స్కూల్ లో ఉన్న వినాయకుడు దగ్గర దణ్ణం పెట్టుకున్నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి. ఇక నుంచి ఏ ప్రాబ్లం వచ్చిన మీరిద్దరూ గొడవపడను, కటీఫ్ చెప్పుకోమని ప్రామిస్ చెయ్యమని ఖుషి అడుగుతుంది. ఇద్దరూ ఇక మీదట గొడవ పడమని మాట ఇస్తారు. సులోచన, మాలిని తమ వేద, యష్ మీద పూజ చేయించాలని గొడవ పడుతూ ఉంటారు. సులోచన అల్లుడికి సపోర్ట్ చేస్తే మాలిని తన కోడలు వేదకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. అందరూ కలిసి పూజ చేయించుకుంటారు.


ఇన్నాళ్ళూ ఎంత నలిగిపోయారు, ఎంత బాధపడ్డారు ఇక ఏ ప్రాబ్లం రాకూడదు మా మధ్య మనస్పర్థలు రాకూడదని వేద యష్ గురించి మనసులో అనుకుంటుంది. వేద మొహంలో సంతోషం చూసి ఎన్నాళ్ళు అయ్యిందో తన మొహంలో ఈ నవ్వు, సంతోషం ఎప్పటికీ ఉండాలని యష్ మనసులో దేవుడిని వేడుకుంటాడు. వేద ఒక చోట కూర్చుని ఉంటే యష్ వస్తాడు.


యష్: నా కొడుకు ఆదిని నువ్వు క్షమించినందుకు, ఒప్పుకుంటాను ఒక భర్తగా, తండ్రిగా ఒడిపోయాను


వేద: ఇప్పుడు ఆదిత్య ఎదుర్కొంటున్న సమస్యకి కారణం మీరే. తప్పు ఆదిత్యది  కాదు మీది, మాళవికది. ఒక పసివాడు తప్పు చేస్తే అది తల్లిదండ్రులది. మీ పెంపకం ఒక ఫెయిల్యూర్. భార్యాభర్తలుగానే కాదు తల్లిదండ్రులుగా కూడా ఫెయిల్ అయ్యారు. నేరం మీది శిక్ష ఆ పసివాడికా అందుకే కోర్టులో ఆ నిర్ణయం తీసుకున్నాను


Also read: కడుపు పోయినట్టు నాటకం ఆడిన మల్లిక- రామాకి నిజం చెప్పిన జానకి, మాధురి కేసులో కన్నబాబు పాత్ర


యష్: తప్పు ఆదిత్యది కాదు నాదే కానీ వాడిని క్రమశిక్ష కలిగిన పిల్లాడిగా మార్చలేకపోయాను. ఆదిత్యకి తల్లిగా మాళవిక ఉండటం, నా ఇద్దరి పిల్లల్లో ఉన్న తేడా పెంపకంలో కనిపిస్తుంది. అలా అని ఆదిత్యని వదిలెయ్యలేను. మంచి భర్తని కాలేకపోయాను కానీ మంచి తండ్రిని అవుతాను


స్కూల్ ప్రిన్సిపల్ యష్ ని పిలుస్తుంది. పిల్లల మధ్య గొడవ జరిగింది, దెబ్బలు తగిలాయి, కొంచెం ఉంటే ప్రాణం పోయేదని ప్రిన్సిపల్ చెప్తుంది. ఆదిత్య ఒక పిల్లాడి మీద దాడి చేశాడని అంటుంది. చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది కణతకి తగిలి ఉంటే ఆది హంతకుడు అయ్యేవాడు. మీ ఆదిని పిలిచి మందలించబోతే తను ఎదురు తిరిగి మాట్లాడినట్టు చెప్తుంది. ‘మా డాడీ నాకు సపోర్ట్ గా ఉన్నాడు, ఒకసారి కాపాడాడు మరోసారి కాపాడడా ఏంటి, నేను ఇలాగే ఉంటాను ఏం చేస్తారో చేసుకోండి, ఏం చేసినా నన్ను కాపాడటానికి మా డాడీ ఉన్నాడు’ అని ఆదిత్య టీచర్ నిర్లక్ష్యంగా మాట్లాడాడు.


Also read: వేద త్యాగాన్ని మెచ్చుకున్న కుటుంబం- మరో కుట్ర ప్లాన్ చేసిన మాళవిక


మీ కొడుకు చెడిపోయాడు, అందుకు కారణం తను కాదు మీరే.. మీరు సపోర్ట్ చేస్తున్నారనే ధైర్యంతోనే తను ఎన్ని తప్పులైనా చేస్తాడని ప్రిన్సిపల్ హెచ్చరిస్తుంది. పోలీసులు ఆదిత్యని అరెస్ట్ చేస్తారు. యష్ జడ్జితో ఏదో మాట్లాడుతూ ఉంటే మాళవిక వస్తుంది. ఆదిత్యని ఇక్కడకి తీసుకొచ్చింది ఎవరని మాళవిక గట్టిగా అరుస్తుంది. అప్పుడే వేద వాళ్ళు కూడా కంగారుగా అక్కడికి వస్తారు. తన కొడుకుని తీసుకెళ్ళి పోతానని గట్టిగా అరుస్తుంది. వేదని చూసి తన మీద అరుస్తుంటే యష్ వచ్చి ఆపుతాడు.