స్కూల్ లో ఆదిత్య కారు కీస్ తీసుకుని డ్రైవింగ్ చేయడానికి వెళ్లబోతుంటే వేద అడ్డుపడి కీస్ లాక్కుంటుంది. ఆదిత్య ఎదురుతిరగడంతో వేద తనని చెంప పగలగొడుతుంది. దీంతో ఆదిత్య కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే వచ్చిన డ్రైవర్ మీద వేద అరుస్తుంది. మీరు కొట్టిన చెంప దెబ్బ వాళ్ళ అమ్మ ఎప్పుడో కొట్టి ఉంటే ఈ పిల్లాడు చెడిపోయే వాడు కాదు అసలు మీ అమ్మగారికి యాక్సిడెంట్ కూడా అయ్యేది కాదు. యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు ఆదిత్య బాబు అని డ్రైవర్ చెప్తాడు. కోర్టు దగ్గర అందరూ వేద కోసం ఎదురు చూస్తుంటే లాయర్ వచ్చి మాట్లాడుతుంది. వేదకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఝాన్సీ అంటుంది.


సులోచన దీని గురించి ఆలోచిస్తు లాయర్ పరమేశ్వర్ ని కలవాలని అనుకుంటుంది. మాలిని సులోచనని తీసుకెళ్తుంది.. కేసు క్లోజ్ చేయించమని సులోచన అడగటంతో మాలిని షాక్ అవుతుంది. ‘అసలు ఇది యాక్సిడెంట్ కాదని కోర్టులో సాక్ష్యం చెబుతాను, నేనే హైబీపీ వచ్చి వెళ్ళి వాళ్ళ కారు ముందు పడ్డాను. తలకి దెబ్బ తగిలింది అని వాంగ్మూలం ఇస్తాను’ కేసు కొట్టేయించమని అడుగుతుంది.


మాలిని: ఎందుకు ఇలా చేస్తున్నావ్ సులోచన ఆ మాళవికని జైలుకి పంపించాలని వేద ఫైట్ చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నవ్


Also Read: ఐపీఎస్ పుస్తకం పట్టిన జానకి- జ్ఞానంబ కాళ్ళ మీద పడి నిజం చెప్పిన మల్లిక


సులోచన: ఆ మాళవిక జైలుకి వెళ్ళడం కంటే నా కూతురు సంతోషం దాని కాపురం ముఖ్యం. ఈ యాక్సిడెంట్ వల్ల వేదకి అల్లుడు గారికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ కేసు వల్ల వాళ్ళు టెన్షన్ పడటం అవసరమా. పిల్లలిద్దరు ఆనందంగా కాపురం చేసుకుంటే చాలు. ఏదో ఒకటి చేసి ఈ గండాన్ని గట్టెక్కించండి


వేద కారులో వెళ్తు జరిగిన విషయాలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కోర్టులో ఝాన్సీ, పరమేశ్వర్ ఎదురుపడతారు. ఈ కేసు గెలవబోతున్నా అని ఝాన్సీ చెప్తుంది. కేసుకి సంబంధించి అన్ని దారులు మూసేశానని పరమేశ్వర్ అంటాడు.


ఝాన్సీ: మీరు యాక్సిడెంట్ జరిగిన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్ని దొంగిలించారు కానీ అక్కడ పెట్రోల్ బంకులో ఉన్న సీసీటీవీ గురించి తెలుసుకోలేకపోయారు. అందులో యాక్సిడెంట్ ఎవరు చేశారు, దాని ఓనర్ ఎవరు, కారు నడిపిన నేరస్థుడు ఎవరు అనేది అన్ని రికార్డు అయ్యాయి దానికి సంబంధించిన ఫుటేజ్ వీడియో ఈ పెన్ డ్రైవ్ లో ఉంది. మనం న్యాయం తరఫున పోరాడాలి


పరమేశ్వర్ వచ్చి ఇదే విషయాన్ని యష్ కి చెప్తాడు. ఆ మాటకి యష్, మాళవిక షాక్ అవుతారు. ఏదో ఒకటి చేసి ఆదిత్యని కాపాడమని యష్ బతిమలాడతాడు. ఈ కేసు వల్ల నా భార్యని కుటుంబాన్ని బాధపెట్టాను ఆది కోసం ఎలాగైనా వాడిని కాపాడండి అని బతిమలాడతాడు. ఈరోజు కోర్టులో నేను ఏమి చేయలేను తిరుగులేని సాక్ష్యం తీసుకొచ్చింది ఝాన్సీ, మీ ఆవిడ సంకల్పం గొప్పది, మీ ఆవిడ ఆదిత్యని జైలుకి పంపించి తీరుతుందని పరమేశ్వర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. కోర్టు వాదనలు మొదలవుతాయి. వేద ఇంకా రాలేదని కొద్దిగా సమయం ఇవ్వమని ఝాన్సీ అడుగుతుంది. అప్పుడే వేద కోర్టులోకి వస్తుంది. ఝాన్సీ యాక్సిడెంట్ కి సంబంధించిన పెన్ డ్రైవ్ జడ్జికి ఇస్తుంది. అది చూడటానికి ముందే వేద జడ్జితో మాట్లాడాలని అంటుంది.


Also Read: వీరనారి అవతారమెత్తిన తులసి- భాగ్య ఐడియా, లాస్యకి షాకిచ్చిన నందు


మీరు అనుమతి ఇస్తే కేసు విత్ డ్రా చేసుకుంటానని వేద జడ్జిని అడుగుతుంది. ఆ మాటకి మాళవిక, యష్ షాక్ అవుతారు. కేసు గెలుస్తామని ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ఝాన్సీ అంటుంది.


తరువాయి భాగంలో


తప్పు చేశావ్ వేద.. యష్ ని కూడా ఎదిరించి నీకు అండగా నిలిస్తే ఎందుకు ఇలా చేశావని మాలిని కోప్పడుతుంది. ‘తప్పు చేశాను అసలు ఈ యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు ఆదిత్య. నాకు ఖుషి మాత్రమే బిడ్డ కాదు ఆదిత్య కూడా బిడ్డే. నా తల్లి మనసు దీనికి ఒప్పుకోలేద’ని వేద ఏడుస్తూ చెప్తుంది.