సులోచన దామోదర్ వాళ్ళని కాకపట్టే పనిలో పడుతుంది. చిత్ర ప్రేమ సంగతి దామోదర్ వాళ్ళకి చెప్తుంది. వసంత్ చిత్ర ప్రేమించుకుంటున్న విషయం సులోచన దామోదర్ వాళ్ళతో చెప్పేస్తుంది. అదంతా వేద, యష్ చూస్తూ ఉంటారు. నిధి వచ్చి నేను అన్నీ విషయాలు మా అన్నయ్య వదిన వాళ్ళకి చెప్పేసాను దీని గురించి డిస్కషన్ కూడా జరిగింది నిర్ణయం కూడా తీసుకున్నాం, మీరు అంకుల్ ఇంకా పాత రోజుల్లోనే ఉన్నారు. నేను లండన్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని డీప్ గా లవ్ చేశాను తర్వాత తాను నాకు నచ్చలేదు వదిలేశా. తర్వాత వసంత్ నచ్చాడు అదే విషయం అన్నయ్య వాళ్ళకి చెప్పాను ఒకే చెప్పారు అని నిధి చెప్తుంది. మీ చిత్రకి న్యాయం చెయ్యాలని ఆశ పడ్డారు తప్పు లేదు కానీ నాకు నా చెల్లి తర్వాతే ఎవరైనా అని దామోదర్ చెప్పడంతో వేద షాక్ అవుతుంది. మా నిధి నిశ్చితార్ధం వసంత్ తో జరిగి తీరుతుందని దామోదర్ దంపతులు తేల్చి చెప్పేస్తారు.


మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు, దీన్ని ఇక్కడితే వదిలేస్తే మంచిది అని యష్, వేదతో అంటుంటే దామోదర్ వస్తాడు. నా చెల్లిని ఒక మంచి ఇంటి కోడలిగా పంపించేలా చేశావ్ నా కల నీ వల్లే తీరింది థాంక్యూ అని దామోదర్ అంటాడు. నిధి, వసంత్ ల పెళ్లి ఎ ఆటంకం లేకుండా జరిగి తీరుతుందని యష్ మాట ఇస్తాడు. నాకు ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు యష్ మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకుంటాడు అని దామోదర్ అంటాడు. సులోచన ప్లాన్ ఫెయిల్ అయినందుకు మాలిని సంబరపడుతుంది. ఇద్దరి మధ్య కాసేపు వాదులాట జరుగుతుంది.


Also Read: లాస్యని ఆట ఆడేసుకున్న లక్కీ- హనీని తీసుకుని తులసి ఇంటికి సామ్రాట్, శ్రుతి మీద తన ప్రేమని బయటపెట్టిన ప్రేమ్


ఎన్నో లవ్ స్టోరీలు చూసా కానీ ఫస్ట్ టైమ్ చిత్ర వసంత్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లు వస్తున్నాయి ఒకసారి దామోదర్ గారితో కాల్ చేసి మాట్లాడతారా అని వేద యష్ ని అడుగుతుంది. ఉన్న అవకాశం కూడా పోయిందని అంటుంది. ఆయనతో మాట్లాడి ప్రయోజనం ఏమి లేదని అంటాడు. ఏదైనా రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది. వాళ్ళ పెళ్లి జరగాలని తలరాతలో రాసి లేదేమో అని యష్ అంటాడు. మాట మారుస్తున్నారా అని వేద అంటుంది. నిధి, వసంత్ కి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాను ఇక ఇదే ఫైనల్ అని యష్ అంటాడు. మరి చిత్ర, వసంత్ ప్రేమ సంగతి ఏంటి అని వేద అంటే పెళ్లి జరిగితే వాళ్ళే మనసు మార్చుకుంటారులే అని అంటాడు. మీ నిర్ణయం ఫలితం తర్వాత మిమ్మల్నే బాధిస్తుందని వేద చెప్తుంది. 


ఖైలాష్ వేదకి ఫోన్ చేస్తాడు. ఎన్ని సార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా, ఏం బతుకురా నీది అని వేద తిడుతుంది. కానీ ఆ మాటలు ఖైలాష్ పట్టించుకోకుండా వెకిలిగా మాట్లాడతాడు. అప్పుడే కోపంగా వేద కాల్ కట్ చెయ్యబోతుంటే ఆదిత్య వచ్చి ఫోన్ అడుగుతాడు. ఖుషితో మాట్లాడాలి అని కాల్ చేశాను అంటాడు. ఖుషి, ఆదిత్య చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఖుషి చిత్ర కళ్ళ గంతలాట ఆడుకుంటూ ఉంటుంటే వసంత్ వస్తాడు. చిత్ర కళ్ళకు గంతలు కట్టుకుని వసంత్ ని పట్టుకుంటుంది.


Also Read: మాధవ్ కి వాత పెట్టిన భాగ్యమ్మ- రాధని మెచ్చుకున్న దేవుడమ్మ, రెండు ఇళ్ళల్లో వినాయక చవితి సంబరాలు


తరువాయి భాగంలో..


వేద, చిత్ర కూడా యష్ వాళ్ళు ఉన్న షాప్ కె షాపింగ్ కి వస్తారు. మా చిత్రకి కూడా పెళ్లి కుదిరిందని ఒక వ్యక్తిని చూపిస్తుంది. అతను వచ్చి చిత్ర డార్లింగ్ అని కౌగలించుకునేసరికి వసంత్ కి కోపం వచ్చేస్తుంది.