బిగ్‌బాస్‌లో గొడవలు, పంచాయతీలు జోరుగా సాగుతున్నాయి. మొదటి వారమే ఇలా ఉంటే ఇక రాబోయే వారాల్లో గొడవలు తారాస్థాయికి చేరేలా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో అందరూ రేవంత్‌ను టార్గెట్ చేస్తూ కనిపించారు. గలాటా గీతూ ఓవర్ యాక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంట్లో సగం మంది కామ్‌గా ఉంటున్నా, సగం మంది మాత్రం రెచ్చిపోతున్నారు.
కెప్టెన్సీ కంటెడెర్లు
క్లాస్ సెక్షన్లో ఉన్న ముగ్గురు గీతూ, ఆది రెడ్డి,నేహా చౌదరి కెప్టెన్సీ కంటెడెర్లుగా మారారు. మాస్ సెక్షన్ నుంచి మరో ముగ్గురినీ కెప్టెన్సీ కంటెడెర్లుగా ఎంపిక చేయమని అడిగాడు బిగ్ బాస్. ఆ సమయంలోను అనవసరంగా గీతూ ఓవరాక్షన్ చేసింది. మెరీనా- రోహిత్ జంట, ఆర్జే సూర్య, బాలాదిత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. కెప్టెన్సీకి ఆరుగురు పోటీపడబోతున్నారన్నమాట.
గొడవలు, పంచాయతీలు
ఇనయ తనను తెల్లగా,అందంగా ఉన్నావని అందని, తెల్లగా ఉండడం వేరు, అందంగా ఉండడం వేరని వివరించానని అందరికీ చెప్పుకొచ్చాడు బాలాదిత్య. దానికి ఇనయ రెస్పాండ్ అయ్యింది. తాను బాడీ షేమింగ్ చేయలేదని, పొగిడానని వివరణ ఇచ్చింది. ఎన్నిసార్లు మంచిగా ఉందామనుకున్నా, మీరు నన్ను ప్రతి విషయంలో టార్గెట్ చేస్తున్నారని, తాను ఫైట్ చేయడానికి రెడీ అని చెప్పింది.
మెరీనా -రోహిత్, శ్రీ సత్య చిన్న ప్రాంక్ చేసి తుస్సుమనిపించారు. తన భర్తతో ఉండేందుకు సత్య అవకాశం ఇవ్వడం లేదంటూ గట్టిగా అరిచింది మెరీనా. కానీ ఈ ప్రాంక్ పెద్దగా పండలేదు. తరువాత బిగ్‌బాస్ చిన్న పోటీ పెట్టారు. ఆ పోటీ కోసం ఇంటి సభ్యులంతా రెండు టీమ్‌లుగా విడిపోయారు. టీమ్ ఏ నుంచి శ్రీ సత్యా, టీమ్ బి నుంచి ఆరోహి వెళ్లారు. అడిగిన ప్రశ్నలకు మొదల ఎవరైతే బజర్ నొక్కి జవాబులు చెబుతారో వారే విన్నర్. ఇందులో శ్రీ సత్య గెలిచింది. టీమ్ ఏ వారికి మంచి గిఫ్టులు పంపిచారు బిగ్ బాస్.
ఆరోహి- రేవంత్ మధ్య మళ్లీ రచ్చ
ఆరోహిని రేవంత్ ఆడతా అని వెళ్లావ్ ఏమైందో చూడు అన్నాడు. దానికి ఆరోహి రచ్చరచ్చ చేసింది. ఆమె ఎందుకు అంతగా రియాక్ట్ అయిందో కూడా ప్రేక్షకులకు అర్థం కాలేవు. వేలు చూపిస్తూ రేవంత్ తో గొడవ పెట్టుకుంది. గార్గెన్ ఏరియాలోకి కాసేపు ఏడ్చి రేవంత్ ను తిట్టుకుంది. జనాభా లిస్టులోంచి ఆయనను తీసేయాలనుంది అంటూ నోటికొచ్చిన మాటాలు మాట్లాడింది. సూర్య కాసేపు ఆమెను ఓదార్చి హగ్గులు ఇచ్చాడు. తరువాత వేలు చూపించి మాట్లాడడం నాదే తప్పు సారీ చెబుతా అంటూ రేవంత్ దగ్గరికీ వెళ్లింది. అక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంది కానీ, వారిద్దరి మధ్య పరిష్కారం అయినట్టు కనిపించలేదు.
అనవసరంగా ఆదిరెడ్డి....
యూట్యూబ్ లో తెగ మాట్లాడే ఆదిరెడ్డి ఇంట్లో మాత్రం మౌనంగా ఉంటున్నాడు. పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు. తానేదో లోకంలో ఉన్నట్టు వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన కూడా రేవంత్ ను తప్పుపట్టబోయాడు. బయట నువ్వెవరు అయితే ఏంటి బ్రో, ఇంట్లో అందరూ సమానమే అంటూ తనకు సంబంధం లేని విషయాలు మాట్లాడాడు. పక్కనే అతి బిడ్డ గలాటా గీతూ ఊరుకుంటుందా. అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉంది.
అతిబిడ్డ గలాటా గీతూ...
గీతూ తనలో తానే మాట్లాడుకుంటూ కనిపించింది. నేను మాట్లాడటానికి ఒకరి పర్మిషన్ కావాలా? ఎందుక్కావాలి? వాళ్లేమైనా బిగ్ బాసా? అంటూ మాట్లాడుకుంది. మాట్లాడితే తనను అతి బిడ్డ (ఓవర్ యాక్షన్ చేస్తుందని) అనుకుంటారని, చిన్నప్పట్నించి అందరూ అనుకుంటూనే ఉన్నారని చెప్పుకుంది. అయినా తాను అతి చేయాలని డిసైడ్ అయ్యింది ఈ అతి బిడ్డ.
Also read: తొలి వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే, ఈ ఏడుగురిలో ఎవరు బయటకు వెళ్తారు?
Also read: నామినేషన్లలో ఆ ముగ్గురు, బయటకు వెళ్లేది ఆమేనా? ఆకలితో ఏడ్చేసిన రేవంత్