ఖుషి కోసం వేద, యష్ వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా కనిపించకపోయేసరికి వేద కుమిలి కుమిలి ఏడుస్తుంది. 'ఇదంతా నా వల్లే. నాకు ఎంత పెద్ద శిక్ష వేశావ్ తల్లి. ఈ అమ్మని వద్దనుకున్నవా ఈ అమ్మ మీద అంతా కోపం వచ్చిందా, తప్పు నీది కాదు నాది. నీకు నా మీద కోపం వచ్చేలా నేనే చేశాను. ఎప్పుడు నవ్వుతూ తుళ్లుతూ ఆడుతూ పాడుతూ ఉండే నిన్ను ఇంత బాధపెట్టాను' అని వేద ఏడుస్తుంది. నువ్వే కాదు వేద నేను కూడా తప్పు చేశాను ఖుషిని ఇంట్లో వదిలేసి వెళ్లాల్సింది కాదని యష్ కూడా ఆవేదన చెందుతాడు. 'అసలు నేను మిమ్మలని పెళ్లి చేసుకుందే ఖుషి కోసం..  తనతో అమ్మ అని పిలిపించుకోవడం కోసం కానీ నేను ఏం చేశాను అమ్మ స్థానాన్ని గాలికి వదిలేసి భార్య స్థానం కోసం పాకులాడాను. కోడలి స్థానం కోసం కొట్లాడాను. భార్యగా, కోడలిగా ఒక మర్యాద కావలసి వచ్చింది. నా అహానికి ఆత్మాభిమానం అని పేరు పెట్టాను, పొగరుకి పట్టుదల అని సరిపెట్టుకున్నాను. ఏవేవో ఆలోచించాను ఖుషిని తప్ప, ఏవేవో కావాలనుకున్నాను ఖుషి సంతోషం తప్పా, నిన్ను నిర్లక్ష్యం చేశానమ్మా నీ మనసు నొప్పించాను. నాకు నేనే నిన్ను దూరం చేసుకున్నాను. కడుపు కోత లేని నేను ఎలా తల్లిని అవుతాను. నీకు జన్మ ఇవ్వని నేను అమ్మని ఎలా అవుతాను. నీ చేత అమ్మా అని పిలిపించుకునే అర్హత నాకు లేదు ఖుషి, అమ్మగా పనికిరాను, ఆడడానిగా కూడా పనికిరాను' అని కుమిలి కుమిలి ఏడుస్తుంది. 


Also Read: తులసి ముందు అడ్డంగా బుక్ అయిన సామ్రాట్- సంగీతం పాఠాలు నేర్చుకోవడానికి తులసి దగ్గరకి వచ్చిన హనీ


'ఎవరన్నారు నువ్వు అమ్మవి కాదని, నీ కళ్ల నుంచి కారే ప్రతి కన్నీటి బొట్టు నీ కడుపు తీపికి సాక్షి. నీ బిడ్డ కోసం నువ్వు పడుతున్న బాధ చెప్తుంది నువ్వు తనకి అసలు సిసలు అమ్మ అని. ధైర్యంగా ఉండు వేద. ఖుషి ఎప్పటికీ నీ బిడ్డే. మీ ఇద్దరిది ఈ జన్మల బంధం కాదు ఎన్నెన్నో జన్మల బంధం. మీ ఇద్దరినీ విడదీయడానికి ఆ భగవంతుడు కూడా భయపడతాడు' అని యష్ తనని ఓదారుస్తాడు. యష్, వేద అభిమన్యు మీద అనుమానపడతారు. ఆవేశంగా అభిమన్యు ఇంటికి వస్తారు. నా కూతురు ఎక్కడా అని యష్ అరుస్తూ అభిమన్యు కాలర్ పట్టుకుంటాడు. ఖుషి సంగతి నాకేం తెలుసు, నీ కూతుర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి, మర్యాదగా వచ్చిన దారినే వెళ్తావా లేదంటే పోలీసులని పిలిచి లాకప్ లో వేయించమంటావా అని అభి రివర్స్ అవుతాడు. కోపంగా యష్ అభిమన్యు మీదకి వస్తుంటే మాళవిక అడ్డుపడుతుంది. నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు అని యష్ అరుస్తాడు. నా కూతురు జోలికి వస్తే మర్యాదగా ఉండదని వేద అభిమన్యుకి వార్నింగ్ ఇస్తుంది. 'ఖుషి నా కన్నకూతురు.. డ్రామాలు ఆడి, మోసం చేసి నా దగ్గర నుంచి తీసుకెళ్లారు. ఒక్క గంట టైం ఇస్తున్నాను మీకు నా కూతురు ఎక్కడ ఉందో వెతికి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి. లేదంటే మీ మీద పోలిసు కేసు పెట్టి మిమ్మలని లోపలికి తోయిస్తాన'ని మాళవిక యష్, వేద కి డెడ్ లైన్ పెడుతుంది. 


Also Read: ఆదిత్యపై సత్య అనుమానం, రుక్మిణి దగ్గరకి వచ్చి ఆరా- మాధవని వదిలిపెట్టేదె లేదంటున్న ఆదిత్య


ఖుషితో గడిపిన క్షణాల్ని తలుచుకుని వేద,యష్ బాధపడుతూ ఉంటారు. ఇద్దరూ తాము చేసిన తప్పులు గుర్తు చేసుకుంటూ అలా చేసి ఉండాల్సి ఉంది కాదని బాధపడతారు. ఖుషి ఇష్టంగా పెంచుకునే కుక్కపిల్ల చిట్టి మెడలో ఒక లెటర్ ఉండటాన్ని యష్ వాళ్ళు గమనిస్తారు. 'మమ్మీ, డాడీ నేను ఈ లెటర్ మీ ఇద్దరికీ కలిపి రాస్తున్నా. మీరు నన్ను మమ్మీ కావాలా, డాడీ కావాలా అని అడిగితే నాకు ఇద్దరి కావాలి. మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా అంటే నాకు ఇద్దరు ఇష్టమే అని చెబుతాను. మమ్మీ డాడీ ఇద్దరు కావాలి. నేను మీ ఇద్దరితో కలిసి ఆడుకోవాలి, అల్లరి చేయాలి, అన్నం తినాలి, నిద్రపోవాలి. మీ ఇద్దరికీ నేను ఒక్కదాన్నే కావాలి. కానీ నాకు మీరిద్దరు ఒకటిగా కావాలి. మమ్మీ నాకు నువ్వంటే బోలెడు ఇష్టం, డాడీ నువ్వంటే నాకు బోలెడు ఇష్టం. మమ్మీ నాకు ఏడుపోస్తుంది. నువ్వు డాడీతో లేవుగా..  డాడీ నాకు ఏడుపోస్తుంది నువ్వు మమ్మితో లేవుగా. మరి నేను ఎవరి దగ్గర ఉండాలి? నేను ఉండను.. ఎవరో ఒకరి దగ్గర ఉండను..  ఉండలేను..  అందుకే నా కోపం వచ్చింది. మమ్మీ నేను నీకు వద్దా మమ్మీ, నేనంటే నీకు ఇష్టం లేదా నా మీద కోపమా. నన్ను నిజంగా కావాలనుకుంటే నాదగ్గరకి రావలనుకుంటే ముందు మీరిద్దరు కలిసి నాకు ప్రామిస్ చేయాలి. ఇంకెప్పుడు గొడవపడకూడదు మీరిద్దరు కలిస్తేనే నాకు కావాలి విడివిడిగా వద్దు. మీరిద్దరు అలా కలిసి ఉంటానని ప్రామిస్ చేస్తేనే మీకు కనిపిస్తా. లేదంటే దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోతాను' అని లెటర్లో రాసి పెట్టి ఉంటుంది. మేము కలిసే ఉంటాం ప్రామిస్ చేస్తాం నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని వేద ఏడుస్తూ అంటుంది. మేమిద్దరం గొడవలు పడం నీ దగ్గరకి వస్తాం అని ఇద్దరు చెప్తారు. చిట్టి(కుక్కపిల్ల) వేద వాళ్ళని ఖుషి ఉన్నచోటుకి తీసుకెళ్తుంది. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. 


తరువాయి భాగంలో.. 


ఇల్లంతా అందంగా అలంకరించి వేదని ఇంటికి తీసుకొస్తారు. ఖుషి వేదకి హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. ఇక యష్ వేద చేతిని పట్టుకుని ఇద్దరు ఇంట్లో అడుగుపెడతారు. అది చూసి ఖుషి సంతోషిస్తుంది.