Emraan Hashmi About ‘OG’ Movie: పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్నది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన ఓ కామెంట్ ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఆయన చెప్పిన విషయం ‘ఓజీ’ గురించేనా అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..


త్వరలో గ్లింప్స్ రాబోతోంది- ఇమ్రాన్ హష్మీ


బాలీవుడ్ లో రొమాంటిక్ స్టార్ గా  పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ.. గత కొంత కాలంగా విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది ఆయన ‘టైగర్ 3’లో విలన్ గా కనిపించారు. ఎప్పుడు ముద్దులతో కవ్వించే ఇమ్రాన్, భీకర విలన్ పాత్రలో కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆయన ‘ఓజీ’ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఆయన రోల్ మరో రేంజిలో ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ‘ఓజీ’ మూవీ గ్లింప్స్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. తమన్ రీసెంట్ గా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా గురించి చేసిన కామెంట్ ఆసక్తి కలిగిస్తోంది. ‘ఓజీ’ మూవీలో ఆయన రోల్ గురించి ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ఇమ్రాన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. “నేను ప్రస్తుతం ఏమీ చెప్పను. త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ కాబోతోంది” అంటూ అప్ డేట్ ఇచ్చారు.






పవన్ కల్యాణ్ పై ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఇమ్రాన్ హష్మీ ఇచ్చిన హింట్ తో పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు పవన్ గురించి ఇమ్రాన్ రీసెంట్ గా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఓజీ’లో ఆయన ఇప్పటి వరకు కనిపించని రీతిలో కనిపిస్తారని చెప్పారు. సెట్స్ లో కూల్ గా కనిపించే ఆయన, సినిమాల్లో చాలా వయోలెంట్ గా ఉంటారన్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోందని చెప్పారు. ‘ఓజీ’ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Aslo: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్‌ప్రైజ్ - పవర్‌స్టార్ డబ్బింగ్ టీజర్‌కేనా?