హీరో దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. "నాకు కొవిడ్ పాజిటివ్ అని తెలిసింది. ఇంట్లోనే, ఐసోలేష‌న్‌లో ఉంటున్నాను. మైల్డ్ ఫ్లూ, స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అంతే తప్ప... నాకు అంతా బావుంది. షూటింగ్స్ వల్ల కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయినవారు ఐసోలేషన్ లోకి వెళ్లండి. కరోనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే... టెస్టులు చేయించుకోండి. కరోనా కాలం ఇంకా వెళ్లలేదు. దయచేసి అందరూ మాస్క్ లు ధరించండి" అని ఆయన పేర్కొన్నారు.





తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా 'మహానటి'. అది మంచి విజయం సాధించింది. అందులో జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ నటనకు మంచి పేరొచ్చింది. అంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో నటించిన 'ఓకే బంగారం' సినిమాకు కూడా చక్కటి స్పందన లభించింది. అనువాద సినిమా 'కనులు కనులు దోచాయంటే' కూడా హిట్టే. ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ నిర్మాణంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.






Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: జనవరి 20 ఎపిసోడ్: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా... 'గుప్పెడంత మనసు' గురువారం ఎపిసోడ్...
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి