యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లాస్ట్ నైట్ కాంప్రమైజ్ (హ్యాక్) అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే...  హ్యాకర్స్ నుంచి అకౌంట్ తన చేతికి తిరిగొచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆయన తెలిపారు. అలాగే, ఫాలోయర్లకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. తన అకౌంట్ నుంచి ఎవరైనా లింక్స్ వస్తే ఓపెన్ చేయవద్దని, మీ వివరాలు అడిగితే ఇవ్వవద్దని దుల్కర్ సల్మాన్ జాగ్రత్తలు చెప్పారు. తన అకౌంట్ నుంచి వచ్చిన లింక్స్‌కు దూరంగా ఉండమని పేర్కొన్నారు.




Also Read: ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న 'సన్ ఆఫ్ ఇండియా' థియేటర్లు! మ్యాట్నీ షోస్ 100 క్యాన్సిల్


మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్... తనకంటూ ప్రత్యేక గుర్తింపు, పేరు తెచ్చుకున్నారు. మలయాళ చిత్రాలే కాదు... తెలుగు, తమిళ, హిందీ సినిమాలూ చేస్తున్నారు.  మణిరత్నం 'ఓకే బంగారం', నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 'కనులు కనులు దోచాయంటే' సినిమా మరో విజయం అందించింది. త్వరలో 'హే సినామికా'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అందులో సుమంత్ ఓ పాత్ర చేస్తున్నారు. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. 


Also Read: ఫుల్లుగా మందు తాగి కారు నడిపిన హీరోయిన్... యాక్సిడెంట్ చేయడంతో ఒకరికి గాయాలు... ఆ తర్వాత పోలీసులతో గొడవ