బాలీవుడ్ లో ఈ మధ్య ఎంత పేరున్న హీరోహీరోయిన్లు నటించినా, ఎంత మంచి దర్శకుల సినిమాలైనా.. థియేటర్లో ఆడుతుందనే నమ్మకం ఉండడం లేదు. సౌతిండియన్ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కి ఎట్రాక్ట్ అయిన బాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు హిందీ సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు. మంచి కంటెంట్ తో సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. గ‌త వారంలో విడుద‌లైన 'లాల్ సింగ్ చ‌డ్డా', 'రక్షాబంధన్' లాంటి భారీ సినిమాను బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అట్టర్ ప్లాప్ అయ్యాయి. 


ఈ సినిమాలు సదరు హీరోల కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఇలాంటి చేదు అనుభవం తాప్సీకి ఎదురైంది. అనురాగ్ కశ్యప్ రూపొందించిన 'దొబారా' సినిమాలో లీడ్ రోల్ పోషించింది తాప్సీ. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటినుంచే ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాల‌ని పిలుపునిచ్చారు. 


దానికి తగ్గట్లే ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి తొలిరోజు విమర్శకుల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. పేరున్న క్రిటిక్స్ ఈ సినిమాకి మంచి రేటింగ్స్ ఇచ్చారు. కానీ సినిమాకి ఆక్యుపెన్సీ మాత్రం లేదు. మొదటిరోజు కేవలం 2 నుంచి 3 పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ కనిపించింది. 


చాలా చోట్ల జనాలు లేక షోలను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ట్రేడ్ ఎనలిస్ట్ సుమిత్ కదేల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఓపెనింగ్ రోజు ఈ సినిమా రూ.20 నుంచి 35 లక్షలు మాత్రమే రాబట్టగలదని.. లాంగ్ రన్ లో కోటిన్నరకు మించి కలెక్షన్స్ రావడం కష్టమేనని తేల్చి చెప్పారు. బాలీవుడ్ లో ఈ బాయ్ కాట్ ట్రెండ్ ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించిందనే చెప్పారు. పైగా ఈ మధ్యన తాప్సీ, అనురాగ్ ల ట్రాక్ రికార్డ్ కూడా అంతగా బాలేదు. అన్నీ కలిపి ఈ సినిమాను డిజాస్టర్ ఫిలింగా చేశాయి. 


Also Read: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!


Also Read: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ