తెలుగు ప్రేక్షకులకు కన్నుల పండుగ... ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకు వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan)... ఒక్క ఫ్రేములో వీళ్ళిద్దరూ సందడి చేయనున్నారు.
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'. తొలి సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. దాంతో రెండో సీజన్ మీద అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టు ప్రతి ఎపిసోడ్‌లోనూ ఇద్దరేసి గెస్టులను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జస్ట్ సినిమా సెలబ్రిటీలకు పరిమితం కాకుండా రాజకీయ నాయకులను సైతం షోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్‌ను తీసుకు వచ్చారు.
పవన్ వెంటే త్రివిక్రమ్
పవన్ కళ్యాణ్‌తో పాటు 'అన్‌స్టాపబుల్ 2'లో ఎవరు జాయిన్ అవుతారు? దర్శకుడు త్రివిక్రమ్ వస్తారా? రారా? నిన్న మొన్నటి వరకు, ఆఖరుకు ఈ రోజు ఉదయం వరకు పెద్ద చర్చ నడిచింది. ఎందుకంటే... త్రివిక్రమ్ దీనికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఆఖరికి జరిగింది వేరు.
పవన్ కళ్యాణ్ వెంట మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం 'అన్‌స్టాపబుల్ 2' సెట్స్‌కు వచ్చారు. వీళ్ళిద్దరితో పాటు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఉన్నారు. ముగ్గురూ ఒకే కారులో దిగారు. పవన్‌ను బాలకృష్ణ ఆత్మయ ఆలింగనంతో స్వాగతించారు.
పవన్ వెంట ఉండటమే కోసం ఎపిసోడ్ షూటింగ్‌లో కూడా త్రివిక్రమ్ పాల్గొన్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి మీద షూటింగ్ జరుగుతోంది. అసలు, ఉదయం వరకు 'హరి హర వీర మల్లు' దర్శకుడు క్రిష్ జాగర్లమూడి షోలో సందడి చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, క్రిష్ ఇంకా రాలేదు. మధ్యలో జాయిన్ అవుతారేమో చూడాలి! ఎందుకంటే... ఆయన షోకి వస్తున్నట్లు సమాచారం అందుతోంది. సాయి ధరమ్ తేజ్ ఫోన్ కాల్ ద్వారా మావయ్యతో మాట్లాడనునట్లు టాక్. ప్రస్తుతం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ హగ్ చేసుకున్న వీడియోలు... త్రివిక్రమ్ అక్కడ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
త్రివిక్రమ్... పవన్ కళ్యాణ్...
పొలిటికల్ డిస్కషన్ ఏంటి?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు సినిమాల్లో మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా సంచలనమే. ఏపీలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన, బావ చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్న తెలుగు దేశం పార్టీ, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పోటీ చేశాయి. పవన్ డబ్బులు తీసుకుని తెలుగు దేశం పార్టీకి మద్దతు ప్రకటించారని వైసీపీ వర్గాలు ఆరోపణలు చేస్తుంటాయి. ప్యాకేజీ స్టార్ కామెంట్స్ చేస్తున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్, జనసేనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర వెనుక సహాయ సహకారాలు అందిస్తున్నారని ఓ ప్రచారం ఉంది. పవన్ స్పీచ్ ఆయనే రాస్తారని ఆరోపణలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాజకీయ చర్చలు, ప్రధానంగా ఆరోపణలపై పవన్ కళ్యాణ్‌ను బాలకృష్ణ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్రివిక్రమ్ రాజకీయాల గురించి ఏం చెబుతారు? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
బాలయ్య, పవన్ మధ్య వారధిగా త్రివిక్రమ్!
అసలు 'అన్‌స్టాపబుల్ 2'కు పవన్ కళ్యాణ్ రావడం వెనుక త్రివిక్రమ్ ఉన్నారనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. గతంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ షోకి వచ్చినప్పుడు... త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఫోన్ చేయగా బాలకృష్ణ మాట్లాడారు.
Also Read : ఇట్స్ ఫ్యామిలీ టైమ్ - న్యూయార్క్ వీధుల్లో భార్యతో ఎన్టీఆర్
'అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్?' అని బాలకృష్ణ అడగటం... అందుకు బదులుగా 'మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్' అని త్రివిక్రమ్ బదులు ఇవ్వడం తెలిసిన విషయమే. అప్పుడు బాలకృష్ణ 'ఎవరితో రావాలో తెలుసుగా!?' అని అడగటం వైరల్ అయ్యింది. అప్పుడే పవన్ కళ్యాణ్ వస్తారని తెలుగు ప్రజలు అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఆ రోజు వచ్చింది.
సంక్రాంతి కానుకగా పవన్ ఎపిసోడ్!
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలని ఆహా వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో రెండో సీజన్‌కు శుభం కార్డు వేస్తారట. ఫస్ట్ సీజన్‌లో మొత్తం పది ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు రెండో సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు ఎపిసోడ్స్ వచ్చాయి. ప్రభాస్, గోపీచంద్ సందడి చేసింది ఏడో ఎపిసోడ్. అది న్యూ ఇయర్ కానుకగా విడుదల కానుంది. ఫస్ట్ సీజన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ, మైటీ భల్లాలదేవ రానా దగ్గుబాటి, దర్శక ధీరుడు రాజమౌళి, అగ్ర దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను వంటి స్టార్లు వచ్చారు. ఆ సీజన్ మహేష్ ఎపిసోడ్‌తో ముగిసింది.
Also Read : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా