Teja On Uday Kiran Death: నేను చనిపోయేలోపు ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ బయట పెడతా : దర్శకుడు తేజ

ఉదయ్ చనిపోయే ముందు తనకి ఫోన్ చేశాడని, జరిగిందంతా చెప్పాడని దర్శకుడు తేజ అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తనకు పూర్తిగా తెలుసన్నారు.

Continues below advertisement

టాలీవుడ్ లో 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' చిత్రాలతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఉదయ్ కిరణ్. అప్పట్లో ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అందుకే ఉదయ్ ను లవర్ బాయ్ గా పిలిచేవారు. అలాంటి ఒక హీరో  తర్వాత వరుసగా కొన్ని ఫ్లాప్ లు రావడంతో కుంగిపోయాడు. అదే సమయంలో వివాహం అయింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పట్లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవ్వడం, కొత్త సినిమాలేవీ రాకపోవడంతో చనిపోయాడని కొంతమంది, ఉదయ్ ఆత్మహత్య వెనుక పెద్దల హస్తం ఉందని కొంతమంది, భార్యతో విభేదాల వల్లే ఇలా చేశాడని ఇంకొంతమంది ఇలా ఎవరికి నచ్చనట్టు వారు కామెంట్లు చేశారు. కానీ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియరాలేదు. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తనకు తెలుసని దర్శకుడు తేజ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

Continues below advertisement

'చిత్రం' సినిమాతో ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేశారు దర్శకుడు తేజ. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే 'నువ్వు నేను' సినిమాను తీశారు. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. హీరోగా ఉదయ్ కు మంచి సక్సెస్ ను అందించాయి. ఈ సినిమాలు తరువాత ఉదయ్ కిరణ్ 'మనసంతా నువ్వే' సినిమాతో యూత్ ఫేవరేట్ హీరోగా ఎదిగాడు. తర్వాత వరుస అపజయాలతో డిప్రెషన్ కు గురయ్యాడు. ఆ తర్వాత 2014 జనవరి లో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడని అన్నారు తేజ. వరుసగా మూడు హిట్ లు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కోల్పోయాడని, ఒక్కసారిగా వచ్చిన స్టార్ డమ్ ను తట్టుకోలేకపోయాడని చెప్పారు. అలాగే తరువాత వరుసగా ఫ్లాప్ లు రావడంతో ఉదయ్ ఉక్కిరిబిక్కిరి అయ్యి డిప్రెషన్ కు గురయ్యాడని తెలిపారు. ఉదయ్ కు వరుస ఫ్లాప్ లు వస్తున్న సమయంలోనే ఉదయ్ తో 'ఔనన్నా కాదన్నా' సినిమా చేశానని అన్నారు. ఉదయ్ చనిపోయే ముందు తనకి ఫోన్ చేశాడని, జరిగిందంతా మొత్తం చెప్పాడని అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తనకు పూర్తిగా తెలుసన్నారు. అయితే అవన్నీ ఇప్పుడు బయటపెట్టనని, సమయం వచ్చినప్పుడు చెప్తానని పేర్కొన్నారు. తాను చనిపోయేలోపు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు తేజ. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై దర్శకుడు తేజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola