Indian 2 Movie Updates: శంకర్ రహమాన్ కాంబోకి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. జెంటిల్‌మేన్‌తో మొదలైన ఈ జర్నీ రోబో 2.0 వరకూ కొనసాగింది. మధ్యలో స్నేహితుడు, అపరిచితుడు సినిమాలకు హేరిస్ జైరాజ్‌ని మ్యూజిక్ డైరెక్ట్‌గా తీసుకున్నారు శంకర్. రోబో 2.0 అనుకున్న స్థాయిలో ఆడలేదు. రహమాన్ అందించిన పాటలకీ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆ తరవాత శంకర్ రెండు భారీ ప్రాజెక్ట్‌లు టేకప్ చేశారు. భారీ సినిమాలైన భారతీయుడు-2, గేమ్ ఛేంజర్ సినిమాలకు రహమాన్‌ని కాకుండా అనిరుధ్‌, తమన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. గేమ్‌ ఛేంజర్‌ సంగతి పక్కన పెడితే భారతీయుడు-2 కి (Indian 2 movie release date) అనిరుధ్‌ని తీసుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ జరిగింది. ఎందుకంటే భారతీయుడు మ్యూజిక్ క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది. అప్పట్లో ఈ ఆల్బమ్ ఓ సెన్సేషన్.


రహమాన్ 90's పాటల్ని ఇష్టపడే వాళ్ల ప్లేలిస్ట్‌లో ఇప్పటికీ ఈ ఆల్బమ్ ఉంటుంది. ఆ రేంజ్ హిట్ ఇచ్చిన ఆయనను కాదని అనిరుధ్‌ని ఎందుకు పెట్టుకున్నారని శంకర్‌పై విమర్శలొచ్చాయి. ఇప్పటి వరకూ శంకర్ దీనిపై ఎక్కడా అధికారికంగా మాట్లాడలేదు. తొలిసారి ఆయన ఈ వివాదంపై స్పందించారు. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో (Bharateeyudu 2 Pre release Event) దీనిపై క్లారిటీ ఇచ్చారు. రహమాన్‌ని కాదని అనిరుధ్‌ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు. 



రోబో 2.0 సినిమాలో పక్షిరాజా గ్రాఫిక్స్‌కి చాలా సమయం పట్టిందని, ఆ తరవాత రహమాన్‌ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలు పెట్టారని చెప్పారు శంకర్. సరిగ్గా అదే సమయంలో భారతీయుడు -2 స్క్రిప్ట్ ఫైనల్ (Indian 2 Trailer ) అయిందని, పాటలు కంపోజింగ్‌ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు రహమాన్‌ని అప్రోచ్ అవ్వాలనుకున్నానని అన్నారు. కానీ అప్పటికే ఆయన రోబో 2.0 బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో బిజీగా ఉన్నారట. బీజీఎమ్ కోసం ఆయన చాలా కష్టపడ్డారని అన్నారు. ఆ టైమ్‌లో వెళ్లి పాటలు కావాలని ఒత్తిడి తీసుకురావడం ఇష్టం లేక వేరే ఆప్షన్‌ చూసుకున్నానని వివరించారు శంకర్. అప్పటికే పాపులర్ అయిన సంతోష్ నారాయణన్, యువన్ శంకర్‌ రాజా పేర్లు కూడా పరిశీలించామని చివరకు అనిరుధ్‌కి ఫిక్స్ (Anirudh Ravichander) అయ్యామని చెప్పారు. కేవలం రహమాన్‌పై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతోనే వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. 


శంకర్, రహమాన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌ వచ్చిందని ఆ మధ్య కొన్ని వార్తలొచ్చాయి. అదేమీ లేదని శంకర్‌ కుండబద్దలు కొట్టేశారు. అయితే అనిరుధ్ కంపోజ్ చేసిన ఇండియన్ -2 ఆల్బమ్ మిక్స్‌డ్ టాక్ (Indian 2 Songs) తెచ్చుకుంది. ఒకటి రెండు పాటలు బాగున్నాయని కొందరు అంటుంటే...అనిరుధ్ రేంజ్‌లో లేదని మరి కొందరు పెదవి విరుస్తున్నారు. 1996లో భారతీయుడు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్ యాక్షన్‌, శంకర్ టేకింగ్‌ ఆ సినిమాని బ్లాక్‌బస్టర్ చేశాయి. పాటలూ అదే స్థాయిలో హిట్ అయ్యాయి. ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు -2 పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్‌జే సూర్య, సిద్దార్థ నటించారు. జులై 12న విడుదల కానుంది. 


Also Read: Kalki 2898 AD Arjun Das: కల్కి 2898 ADలో కృష్ణుడికి గొంతిచ్చిన అర్జున్ దాస్ గురించి ఈ విషయాలు తెలుసా!