Sekhar Kammula May Day Special Wishes To Kubera team: ఒక సినిమా పూర్త‌య్యి.. స్క్రీన్ మీద‌కి రావాలంటే ఎన్నో వేల‌మంది క‌ష్టం ఉంటుంది దాని వెనుక‌. ఎంతో మంది ప‌నిచేస్తే త‌ప్ప స్క్రీన్ పైన సినిమాని ఎంజాయ్ చేయ‌లేం మ‌నం. కనిపించేది కేవ‌లం హీరో, హీరోయిన్, యాక్ట‌ర్స్. డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ వివ‌రాలు బ‌య‌టికి వస్తాయి. కానీ, కొన్ని వంద‌ల‌మంది కృషి ఉంటుంది. అలాంటి వాళ్ల కృషిని గుర్తిస్తూ, వాళ్ల గురించి ఒక వీడియో పోస్ట్ చేశారు డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌. మే 1.. భార‌త‌దేశం మొత్తం కార్మికుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విషెస్ చెప్తూ 'కుబేర' సినిమా సెట్స్ లో ప‌నిచేస్తున్న కార్మికుల వీడియోను షేర్ చేశారు. 


హ్యాపీ మే డే.. 


శేఖ‌ర్ క‌మ్ముల షేర్ చేసిన వీడియోలో కెమెరా మెన్, లైట్ బాయ్స్, మేక‌ప్, ఐర‌న్, వంట మ‌నుషులు, డ్రైవర్లు, ఆర్ట్ వేసేవాళ్ళు, ఇంకా చాలా మందికి సంబంధించి విజువ‌ల్స్ ఉన్నాయి. వాళ్ల క‌ష్ట‌ప‌డుతున్న తీరును ఆయ‌న చూపించారు ఆ వీడియోలో. "మీ క్రియ‌టివిటీ మా క‌ల‌లు సాకారం అయ్యేందుకు ఇంధ‌నం. అద్భుత‌మైన మూవీ క్రూ కి హ్యాపీ మే డే" అంటూ వీడియో పోస్ట్ చేశారు ఆయ‌న‌. ఇక వీడియో చివ‌ర్లో.. "'కుబేర‌ను పూర్తి చేసేందుకు చాలా మంది చేతుల అవ‌స‌రం. టీమ్ శేఖ‌ర్ క‌మ్ముల కుబేర టీమ్.. ప్ర‌తి ఒక్క‌రికి మే డే విషెస్ చెప్తుంది" అని రాసుకొచ్చారు. 






ముంబైలో షూటింగ్.. 


టాలీవుడ్ సూప‌ర్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆయ‌న లిమిటెడ్ గా సినిమాలు తీసిన‌ప్ప‌టికీ.. తీసిన ప్ర‌తి సినిమా దాదాపు హిట్ టాక్ తెచ్చుకుంది. ల‌వ్ స్టోరీలు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, యూత్ ఫుల్ సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు ఆయ‌న రూట్ మార్చారు. 'కుబేర' అనే టైటిల్ తో యాక్ష‌న్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇక దాంట్లో హీరో ధ‌నుష్. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో హీరోయిన్. ఇక అక్క‌డినేని నాగార్జున కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ముంబైలో షూటింగ్‌ షురూ అయ్యింది. షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్లుగా శేఖ‌ర్ క‌మ్ముల పోస్ట్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. 


ఆక‌ట్టుకున్న ఫ‌స్ట్ లుక్.. 


ఇక ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. హీరో ధ‌నుష్ చింపిరి జుట్టు, మాసిన గ‌డ్డంతో న‌వ్వుతూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో నాగార్జున ఖాకీ చొక్క వేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడ‌ని అంచ‌నా వేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇది శేఖ‌ర్ క‌మ్ముల మొద‌టి పాన్ ఇండియా సినిమా. కాగా.. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, మ‌ల‌యాళంలో దీన్ని రిలీజ్ చేయ‌నున్నారు. 


ఇక ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ చేశారు ర‌ష్మిక మంద‌న్న. నైట్ షూట్స్ కి వెళ్తున్నాన‌ని, పొద్దున్న జిమ్ కి వెళ్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు ఆమె. 100 కేజీల బ‌రువులు ఎత్తుతున్న ఫొటోలు షేర్ చేశారు.  ‘కుబేర’ టీమ్ తో కలిసి పని చేయడం చాలా ఫన్ గా ఉంది అంటూ రాసుకొచ్చారు ఆమె. 


Also Read: లిప్ లాక్ సీన్ చూసి మా ఆవిడ ఆ సలహా ఇచ్చింది: సుహాస్