విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు రష్మికా మందన్నా (Rashmika Mandanna) గట్టిగా ఒక్కటి ఇచ్చారా? అతని చెంప మీద చాచి పెట్టి కొట్టారా? కొట్టినట్టు నటించమని అడిగితే నిజంగా కొట్టేశారా? ఇప్పుడు కొంత మందిలో కలుగుతున్న సందేహం ఇది. ఈ సందేహాలకు కారణం రష్మిక చెప్పిన మాటలే.


నిజంగా కొట్టేశా!
రష్మిక కథానాయికగా నటించిన హిందీ సినిమా 'మిషన్ మజ్ను' ఈ నెల 20న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సందర్భంగా సినిమాలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సీన్స్ & యాక్టింగ్ గురించి డిస్కషన్ వచ్చింది. 


నిజ జీవితంలో ఎవరిని అయినా సరే కొట్టడం తనకు నచ్చదని, ఒకవేళ దర్శకుడు కొట్టే సన్నివేశం చెబితే ''ఇప్పుడు ఇది నిజంగా అవసరమా?'' అని అడుగుతానని రష్మిక తెలిపారు. సీన్ కంప్లీట్ చేసిన తర్వాత తోటి నటీనటులకు సారీ చెబుతానని ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ వరకు బావుంది. ఆ తర్వాత అసలు విషయం చెప్పారు.
 
రెండు సార్లు కో స్టార్ చెంప మీద గట్టిగా కొట్టినట్లు రష్మిక వివరించారు. అయితే, ఆమె ఎవరిని కొట్టినదీ చెప్పలేదు. ఆ సన్నివేశాల్లో కో స్టార్స్ కనిపించరని, తన క్లోజప్స్ తీసేటప్పుడు వాళ్ళను కొట్టినట్లు రష్మిక తెలిపారు. 


'గీత గోవిందం' బస్సులో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సీన్, క్లైమాక్స్ సీన్ గుర్తు ఉన్నాయా? రెండు సార్లు హీరోని హీరోయిన్ చంప దెబ్బ కొడుతుంది. 'డియర్ కామ్రేడ్' సినిమాలో మహిళా క్రికెటర్లను వేధించే అధికారిని రష్మిక కొట్టే సీన్ కూడా ఉంది. అందులోనూ చెంప దెబ్బలు ఉంటాయి. 


కన్నడ, తమిళ సినిమాల్లో రష్మిక చంప దెబ్బ కొట్టే సీన్లు ఉన్నాయో? లేవో? అందువల్ల, రష్మిక ఎవరిని గట్టిగా చెంప దెబ్బలు కొట్టారనేది డిస్కషన్ పాయింట్ అయ్యింది.


Also Read : 'మిషన్ మజ్ను' రివ్యూ : రష్మిక 'మజ్ను' గురి తప్పిందా? బావుందా?   


సంక్రాంతికి 'వారసుడు' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను థియేటర్లలో పలకరించారు రష్మిక. అందులో 'రంజితమే...' పాటలో ఆవిడ చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు లేటెస్టుగా 'మిషన్ మజ్ను'తో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2', హిందీలో రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా చేస్తున్న 'యానిమల్'లో నటిస్తున్నారు. 


Also Read : హాలీవుడ్‌లో సినిమా చేయాలనుంటే చెప్పు - రాజమౌళికి 'అవతార్ 2' డైరెక్టర్ ఆఫర్


విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, వాళ్ళు ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. గత ఏడాది ప్రేమ పుకార్ల గురించి రష్మిక స్పందించారు కూడా! ''మేమిద్దరం (విజయ్ దేవరకొండ, రష్మిక) మా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో భారీ హిట్ సినిమాలు చేశాం. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఏవైనా అడగాలంటే... అతడిని అడుగుతాను. కానీ, మా దారులు వేర్వేరు'' అని రష్మిక వివరించారు. లవ్ ఉందని కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు... న్యూ ఇయర్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారని కూడా గుసగుసలు ఉన్నాయి. పైకి ప్రేమ లేదని చెబుతున్నా... లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారని గుసగుస.