Schadenfreude Meaning: ప్రముఖ హీరో, నిర్మాత ధనుష్‌పై లేడీ సూపర్ స్టార్ నయనతార పలు ఆరోపణలు చేసింది. విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాని వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ధనుష్ నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే నయన్, విఘ్నేష్ శివన్ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. దీంతో తమ పెళ్లి సందర్భంగా అందులోని ఫుటేజ్, పాటలని ఉపయోగించాలని వారు అనుకున్నారు. దీనికి ఎన్‌వోసీ కావాలని ధనుష్‌ని అడిగినప్పుడు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

గత రెండు సంవత్సరాలుగా నయనతార డాక్యుమెంటరీ కోసం ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీని ఉపయోగించడానికి అవసరమైన ఎన్‌వోసీ కోసం ప్రయత్నించామని, కానీ ధనుష్ అనుమతి నిరాకరించారని నయనతార తన లేఖలో పేర్కొన్నారు. కానీ మూడు సెకన్ల షూటింగ్ క్లిప్‌ను చూపించినందుకు ధనుష్ నష్టపరిహారంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు పంపారని లేఖలో తెలిపారు.

Also Readఅప్పట్లో ధనుష్ కోసం ఫ్రీగా సాంగ్ నయనతార... కానీ ఇప్పుడు ఎందుకిలా - వైరల్ వీడియో చూశారా?

ఆ జర్మన్ పదానికి అర్థం ఏంటి?ధనుష్ ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారని లేఖలో ఆరోపించారు. "వ్యాపార కారణాలతో మీరు అనుమతి ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ మాపై వ్యక్తిగత ద్వేషంతో మీరు ఈ అనుమతి ఇవ్వలేదు. మీ సినిమా ఆడియో ఆవిష్కరణలో, అమాయక అభిమానులకు మీరు కొన్ని విషయాలను బోధించిన ఉండవచ్చు. సినిమాకి సంబంధించిన అన్ని చెడు విషయాలు కూడా నాకు గుర్తున్నాయి. దీనిపై మీరు ఫేక్ స్టోరీలు తయారు చేసి, మీ తర్వాతి సినిమా ఆడియో లాంచ్‌లో మాట్లాడవచ్చు. కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు." అని అన్నారు.

‘నేను మీకు జర్మన్ భాషలో ఒక పదాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. అదే ‘స్కాడెన్‌ఫ్రూడ్’ (అంటే ఇతరుల బాధలో ఆనందాన్ని కోరుకోవడం). ఇక నుంచి మీరు ఈ ఆనందాన్ని మా బాధల్లో లేదా మరెవరి బాధల నుంచి అనుభవించలేరు అని నేను చెప్తున్నాను. మరొక మనిషిని చిన్నచూపు చూసే ఈ ప్రపంచంలో ఒకరి విజయంలో కూడా మనం ఆనందాన్ని చూడవచ్చు. ఇతరుల ఆనందాన్ని చూసి మనం కూడా ఆనందం పొందవచ్చు. అదే నా డాక్యుమెంటరీ ఉద్దేశం. మీరు కూడా ఈ డాక్యుమెంటరీ చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను’ అని నయనతార తన డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. 

Also Read: ధనుష్ చేసిన దాంట్లో తప్పేముంది? నయనతారకు షాక్ ఇచ్చేలా నెటిజనుల రియాక్షన్