మూడు సెకన్ల వీడియో... అది కూడా నువ్ ప్రొడ్యూస్ చేసిన 'నానుమ్ రౌడీ దాన్' షూటింగ్ టైంలో మా ఫోనులో తీసుకున్నది వాడితే 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిస్తావా? అని ధనుష్ మీద నయనతార నిప్పులు చెరిగింది. ఈ ఇష్యూలో హీరోయిన్లు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే... నెటిజనుల సపోర్ట్ మాత్రం ధనుష్ (Dhanush)కు లభిస్తోంది.
నయనతారకు ధనుష్ సినిమాల్లో హీరోయిన్ల సపోర్ట్!
ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార షేర్ చేసిన లేఖకు శృతి హాసన్ (3), పార్వతి తిరువొతు (మరియన్), ఐశ్వర్య రాజేష్ (వడా చెన్నై), అనుపమా పరమేశ్వరన్ (కోడి), ఐశ్వర్య లక్ష్మి (జగమే తందిరం), ఇంకా మంజిమా మోహన్, అదితి బాలన్ తదితరులు సపోర్ట్ ఇచ్చారు. ఆ పోస్టును లైక్ చేశారు. లేడీ సూపర్ స్టార్ మిగతా హీరోయిన్ల సపోర్ట్ అందుకుంటుంటే... సామాన్యుల సపోర్ట్ ధనుష్ అందుకుంటున్నారు.
నిర్మాత గురించి ఏ రోజైనా ఆలోచించిందా? ఫంక్షన్లకు వచ్చిందా?
నైతికత, నీతి అంటూ నయనతార మాట్లాడటం అసలు బాలేదని ఆమెపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)తో తన ప్రేమ, పెళ్లితో పాటు సినిమాల్లో తన ప్రయాణం గురించి తీసిన డాక్యుమెంటరీకి సమస్య వచ్చేసరికి మోరల్స్ అంటూ మాట్లాడటం బాలేదని మండి పడుతున్నారు.
ధనుష్ చేసిన దాంట్లో తప్పేముంది? అని నయనతారను తీరు నెటిజనులు చాలా మంది ఎండగడుతున్నారు. ఆవిడ ఏమీ ఛారిటీ చేయడం లేదని, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుంచి డబ్బులు తీసుకుని డాక్యుమెంటరీని ఇచ్చింది కనుక ధనుష్ డబ్బులు డిమాండ్ చేయడంలో తప్పేం లేదని చెబుతున్నారు. అసలు నిర్మాతలకు నయన్ ఎప్పుడు సపోర్ట్ చేసిందని ప్రశ్నిస్తున్నారు.
Also Read: అప్పట్లో ధనుష్ కోసం ఫ్రీగా సాంగ్ నయనతార... కానీ ఇప్పుడు ఎందుకిలా - వైరల్ వీడియో చూశారా?
ఓ సినిమాలో నటించేందుకు అగ్రిమెంట్ చేసుకునే సమయంలో ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలకు తాను అటెండ్ అవ్వనని నయనతార కండిషన్ పెడుతుంది. ఆవిడ ఎప్పుడూ ఫంక్షన్లకు వచ్చింది లేదు. భర్త విఘ్నేష్ శివన్ సినిమాలకు మాత్రం బయటకు వచ్చి ప్రమోట్ చేస్తుంది. అదెక్కడి నైతికత అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై ఆవిడ ఎలా స్పందిస్తుందో చూడాలి. అసలు ధనుష్ ఏ విధమైన రిప్లై ఇస్తాడోనని కోలీవుడ్ అంతా వెయిట్ చేస్తోంది.
Also Read: బికినీలో దిశా పటానీ - 'కంగువ'లో బోల్డ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన లేడీ... ఆ ఫోటోలు చూశారా?