మిళ టాప్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. సెల్వా రాఘవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' సినిమాకు సంబంధించి విడుదలై పోస్టర్లు, పాటలు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని కలిగించాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా ఈ నెల (సెప్టెంబర్) 29న విడుదల కాబోతుంది.


హీరో, విలన్ పాత్రల్లో ధనుష్


ఈ సినిమాలో ధనుష్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి హీరో పాత్ర కాగా, మరొకటి విలన్ రోల్. ఈ రెండు పాత్రల్లోనూ ధనుష్ గతంలో ఎప్పుడూ కనిపించని మాదిరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ధనుష్ విలన్ రోల్ పోషించడంతో కోలీవుడ్ లో ఈ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది. అటు ఇదే ఆసక్తిని కంటిన్యూ చేసేలా సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ అందిస్తోంది.  


తెలుగు పోస్టర్ విడుదల


తాజాగా ఈ సినిమా యూనిట్ తెలుగు పోస్టర్ ను విడుదల చేసింది. తెలుగులో  'నేనే వ‌స్తున్నా' అనే టైటిల్‌ ను ఖరారు చేసింది. ఈ మేరకు ధనుష్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రివీల్ చేశారు.  ఈ చిత్రాన్ని తెలుగులో తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వి క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి ఎస్ థాను నిర్మించారు. ధ‌నుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్ర‌మ్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే 'తిరు' మూవీతో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఈ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం  వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్‌ ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.






‘పొన్నియన్ సెల్వన్’తో ‘నేనే వస్తున్నా’ ఢీ


మరోవైపు ‘నేనే వస్తున్నా’ సినిమా మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో పోటీకి దిగబోతోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్‌’ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందు రోజు ధనుష్ నటించిన ‘నేనే వస్తున్నా’ రిలీజ్ కానుంది.  ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నాడు. దీంతో ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలను ఒకేసారి విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Also Read : బాయ్‌కాట్‌ ట్రెండ్‌ను తీసి పారేసిన నాగార్జున - వందో సినిమా గురించి ఏం చెప్పారంటే?




Also Read : రెండు రోజులు షూటింగ్ చేసిన తర్వాత హీరోయిన్‌గా నన్ను తీసేశారనుకున్నా - సిద్ధీ ఇద్నాని ఇంటర్వ్యూ