Captain Miller Movie First Review Rating In Telugu: సంక్రాంతికి 'కెప్టెన్ మిల్లర్'తో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కావడం లేదు. సంక్రాంతి పండక్కి తెలుగులో నాలుగైదు సినిమాలు ఉండటంతో తెలుగు వెర్షన్ వాయిదా వేశారు. కానీ, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. 


పైసా వసూల్ 'కెప్టెన్ మిల్లర్'
దుబాయ్ బేస్డ్ క్రిటిక్, తనను తాను అక్కడ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సందు 'కెప్టెన్ మిల్లర్' షార్ట్ రివ్యూను ట్వీట్ చేశారు. ఇదొక పైసా వసూల్ సినిమా అని పేర్కొన్నారు. ఎప్పటిలా ధనుష్ నటన ఆకట్టుకుంటుందని చెప్పారు. ధనుష్ (Dhanush)ను కింగ్ ఆఫ్ వెర్సటాలిటీ అని పేర్కొన్నారు. సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చారు. 


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం' సినిమాకు కూడా ఉమైర్ సందు రివ్యూ పోస్ట్ చేశారు. ఆయన ఏం చెప్పారో తెలుసుకోవడం కోసం కింద ఉన్నలింక్ క్లిక్ చేయండి


Also Read: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఓవర్సీస్ రిపోర్ట్






మూడు పాత్రలో ధనుష్ - అభిమానులకు ట్రిపుల్ ధమాకా
హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా 'కెప్టెన్ మిల్లర్' తెరకెక్కుతోంది. ఇందులో ధనుష్ మూడు పాత్రలు చేశారు. ఆయన మూడు క్యారెక్టర్ల పేర్లు... మిల్లర్, ఈశ, అనలీశ! బ్రిటీషర్స్ దగ్గర ఆయుధాలు తస్కరించి వాళ్ళపై పోరాటం చేసిన యోధుడి పాత్ర అభిమానులను ఆకట్టుకుంటోంది. యుద్ధ భూమిలో గన్ పట్టుకుని నడుస్తున్న ఆయన లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ''ఫ్రీడమ్ అంటే రెస్పాక్ట్'' అని ఫస్ట్ లుక్ (Captain Miller First Look)కి ధనుష్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్ర కథ 1930 - 40ల నేపథ్యంలో సాగుతోందని నిర్మాతలు తెలిపారు. ధనుష్ కెరీర్‌లో భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది.


Also Read: తెలివిగా తప్పించుకున్న శ్రీలీల, తమన్ ఎంతడిగినా కుర్చీ మడత పెట్టలేదు!



ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న 'కెప్టెన్ మిల్లర్' సినిమాలో యువ తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌ కుమార్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదితా సతీశ్‌, జాన్ కొక్కెన్, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్, వినోద్ కిషన్, నాజర్, విజి చంద్రశేఖర్, బాల శరవణన్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : టి. రామలింగం, కూర్పు : నాగూరన్,  ఛాయాగ్రహణం : శ్రేయాస్ కృష్ణ, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ : సత్య జ్యోతి ఫిల్మ్స్, సమర్పణ : టీజీ త్యాగరాజన్, నిర్మాతలు : సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌, రచన & దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్.