చిన్మయి మాధవ్ గదిలో తాళిబొట్టు చూస్తుంది. రుక్మిణికి అది చూపిస్తుంది. లగ్నపత్రికతో పాటు మాధవ్, రుక్మిణి కలిసి ఉన్నట్టు ఫోటో, తాళి బొట్టు చూసి రుక్మిణి షాక్ అవుతుంది. మా నాన్న తప్పు చేస్తున్నాడు, నిన్ను ఇంకా బాధపెట్టాలని చూస్తున్నాడు, తాతయ్య వాళ్ళని మోసం చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు చెల్లిని తీసుకుని వెళ్లిపో అని చెప్తుంది. ఇవన్నీ చూసినాక కూడా ఈ ఇంట్లో ఉండటం మంచిది కాదు ఈ పోద్దే వెళ్లిపోవాలి అని రుక్మిణి కూడా మనసులో అనుకుంటుంది. దీని గురించే ఆలోచిస్తుంటే భాగ్యమ్మ వస్తుంది. అప్పుడే రుక్మిణికి ఫోన్ వస్తుంది, విషయం చెప్పకుండా టెన్షన్ గా పరుగులు తీస్తుంది.


రుక్మిణి రోడ్డు మీద పరిగెడుతూ ఒక చోట ఆగుతుంది. రుక్మిణీ.. అని దేవుడమ్మ పిలుస్తుంది. అత్తమ్మ పిలిచినట్టు ఉందేంటి అని అనుకుంటుంది. ఈ అత్తమ్మ గొంతు నువ్వు ఇంకా మర్చిపోలేద అని దేవుడమ్మ రుక్మిణి ఎదురుపడుతుంది.


దేవుడమ్మ: ఏంటే ఇది బతికుండి చచ్చిపోయినట్టు నాటకం ఆడి మాకు ఎందుకు దూరం అయ్యావ్. రుక్మిణి రాధగా ఎందుకు మారింది. ఇంత దగ్గరగా ఉంటూ కూడా కంటికి కనిపించకుండా తిరుగుతుంది. ఆ ఇంట్లో ఉంటూ కూడా నేను వచ్చిన ప్రతిసారి కనిపించకుండా ఉన్నావ్. నా మొహం చూడకూడదు అనుకున్నావా, నీ మొహం చూపించకూడదు అనుకున్నావా..


Also Read: 'తప్పు చేస్తున్నావ్ నాన్న' మాధవ్ ని కడిగేసిన చిన్మయి- 'దేవి నా బిడ్డే' సత్యకి చెప్పిన ఆదిత్య


నువ్వు చావలేదు అని నమ్మలేక నీ కోసం గుళ్ళు గోపురాలు అంటు తిరిగిన అత్తమ్మనే, నీకేం ద్రోహం చేశాను అని నా కొడుకుని కలుస్తూ నన్ను కలవకుండా ఉన్నావ్, నా కుటుంబ గౌరవం పెంచుతావ్ అనుకుంటే ఇదా నువ్వు చేసేది, పరాయి దానిలా బతికింది చాలు పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని దేవుడమ్మ రుక్మిణి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే ఆగిపోతుంది. నువ్వు రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం అయ్యింది సత్యతో నేను మాట్లాడతాను అని అంటుంది. నేను రాను అని రుక్మిణి చెప్తుంది. అది నీ ఇల్లు పద వెళ్దాం అంటే ఇగో మాట అంటారని నేను రాలేదు అని కఠినంగా చెప్తుంది. నువ్వేమి సత్య గురించి ఆలోచించాలసిన అవసరం లేదు ఆదిత్య ముందు నీ భర్త, నా మాట విని ఇప్పటికైనా ఇంటికి వెళ్దాం పద అని అంటే రుక్మిణి మౌనంగా ఉంటుంది.


ఇంట్లో నుంచి బయటకి వచ్చేటప్పుడు గర్భవతిగా వచ్చావ్ కదా ఆ విషయం నా దగ్గర దాచావ్ ఎవరే ఆ బిడ్డ అని దేవుడమ్మ ఎమోషనల్ గా అడుగుతుంది. ఆడబిడ్డ పుట్టిందని చెప్తుంది. నా ఇంటి వారసురాలిని కూడా నాకు కనిపించకుండా చేస్తున్నావా అని అంటుంది. బిడ్డని మీ ఇంటికి పంపిస్తాను మిరెమి కంగారు పడకండి అని అంటుంది. ఇంటికి వెళ్దాం అని దేవుడమ్మ ఎంత అడిగినా రాలేను అని రుక్మిణి ఏడుస్తుంది. నా మాట కాదని నన్ను తీసుకెళ్లాలని చూస్తే నేను చచ్చినంత ఒట్టే అని రుక్మిణి అంటుంది. ఏంటే నీ సమస్య అని అడుగుతుంది. రా అంటే రాడానికి నేను మీ ఇంటి కోడలిని కాను నన్ను మన్నించండి అనేసి రుక్మిణి వెళ్ళిపోతుంది.


Also read: యష్, మాళవికలకి షాక్ ఇచ్చిన వేద- సులోచన యాక్సిడెంట్ గురించి నిజం తెలుసుకున్న చిత్ర


ఆదిత్య గురించి ఆలోచిస్తూ సత్య బాధపడుతుంది. అప్పుడే ఆఫీసులో సూట్ కేస్ మర్చిపోయారని తీసుకొచ్చి ఒకతను ఇస్తాడు. అందులో రుక్మిణి ఫోటో చూసి సత్య చిరాకు పడుతుంది. అటు రుక్మిణి దేవుడమ్మ గురించి టెన్షన్ పడుతుంది. నేను ఇక్కడ ఉన్నా అని తెలిస్తే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. నేను వెళ్తే నా చెల్లి బతుకు ఏం కావాలి అని ఏడుస్తుంది.