జానకిని మెట్ల దగ్గరకి తీసుకొచ్చిన మాధవ్ తనని బెదిరిస్తాడు. ‘రాధని నాకు దూరం చెయ్యాలని చూస్తే మాత్రం నీలాగే వాళ్ళు కూడా ఇలా వీల్ చైర్ లో కూర్చోవాల్సి వస్తుంది. రాధ నాది.. నాకు దక్కకుండా ఎవ్వరూ ఆపలేరు’ అని తన నిజస్వరూపం తల్లి ముందు బయటపెడతాడు. రాధ పిల్లలిద్దరికి అన్నం తినిపిస్తూ ఉంటే జానకి చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూస్తున్నావ్ నీకు ఎంత చెప్పినా అలాగే ఉంటున్నావ్ మేము కాసేపు కబుర్లు చెప్తాం అని దేవి అంటుంది. నువ్వేం పరేషన్ కాకు నువ్వు ఎప్పటిలాగా తిరుగుతావ్ అని ధైర్యం చెప్తారు. అదంతా దూరం నుంచి మాధవ్ చూస్తూ ఉంటాడు. మీరు ఎందుకు అలా ఉంటున్నారు అని రాధ కూడా అడుగుతుంది. పెద్ద డాక్టరమ్మ అంట మీకు తొందర్లోనే నయం అవుతుందని చెప్తుంది.


అమ్మకి మళ్ళీ మాట వస్తే నిజం చెప్పకుండా ఉంటుందా. నాన్నకి చెప్పేస్తుంది. ఎలాగైనా దేవిని, రాధని ఆ ఆదిత్య ఇంటికి పంపించాలని చూస్తుంది. అమ్మ మామూలు మనిషి అయితే నేను అనుకునేది జరిగేది ఎలా అని మాధవ్ అనుకుంటాడు. ఇంటికి వచ్చిన ఆదిత్య జానకమ్మని డాక్టర్ కి చూపించావా అని అడుగుతుంది. చూపించాను తొందర్లోనే బాగవుతుందని చెప్పారు అని చెప్తాడు. రాధ జానకమ్మని ఎలా చూసుకుంటుందని దేవుడమ్మ అడుగుతుంది. పాపం బాగా చూసుకుంటుంది కోడలు కదా చాలా బాగా చూసుకుంటుందని ఆదిత్య చెప్తాడు. ఎప్పుడు బయట వాళ్ళ సమస్యలు తప్ప ఇంట్లో ఉన్న నా సమస్య పట్టించుకొడు అని సత్య చిరాకుగా వెళ్ళిపోతుంది.


Also Read: తులసికి వెన్నుపోటు పొడిచిన అనసూయ- ప్రేమ్ కి మ్యూజిక్ ఆఫర్, లాస్యని అజమాయిషీ చేసిన తులసి


జానకి సైగల ద్వారా ఏదో చెప్పాలని చూస్తుంది కానీ అది రాధకి అర్థం కాదు. కొద్ది రోజులు ఆగు నీకేం కాదు తొందరగానే నయం అవుతుందని రాధ అంటుంది. ఇదంతా మాధవ్ చూస్తూనే ఉంటాడు. అయినా జానకి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటే మాధవ్ గదిలోకి వచ్చేస్తాడు. ‘మా అమ్మ ఏం చెప్పాలి అనుకుంటుందో నీకు అర్థం కాకపోయినా నాకు అర్థం అవుతుంది. ఎందుకమ్మా రాధ ఇంత కష్టపడుతున్నావ్ నా తలరాత అంతే నన్ను వదిలేసి మాధవ్, పిల్లల్ని బాగా చూసుకో అని చెప్తుంది’ అని మాధవ్ అంటాడు. అప్పుడే ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి ఆ డాక్టర్ జానకమ్మకి ట్రీట్మెంట్ చేయడం కుదరదు అని చెప్తాడు. ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది, తను కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుందని అంటాడు. అది విని మాధవ్ నవ్వుకుంటాడు.


మీకు వైద్యం చెయ్యడానికి వచ్చిన డాక్టరమ్మకి యాక్సిడెంట్ అయ్యిందంట అని రాధ జానకికి చెప్తుంది. అది విని ఆశ్చర్యపోయినట్టు నటిస్తాడు. ఆదిత్య తెచ్చాడు అంటే వారంలో నయం అవుతుందని అనుకున్నా మా అమ్మకి నయం కావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదా అని నటిస్తుంటే జానకి పక్కనే ఉన్న గ్లాస్ మాధవ్ మీదకు విసిరేలా చేస్తుంది. జానకి కోపంగా మాధవ్ వైపు చూడటం రాధ గమనిస్తుంది. ఈ సారె యాక్సిడెంట్ చేయించాడా అని రాధ అనుమానిస్తుంది. ఆ డాక్టర్ కి అలా జరగడం ఏంటి అని దేవుడమ్మ కూడా షాక్ అవుతుంది.


Also Read: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ


జానకమ్మని చూసుకోవడానికి ఆ ఇంట్లో ఎవరు లేరా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ అని సత్య కోపంగా అడుగుతుంది. షటప్ సత్య నేను ఆఫీసర్ అని నేను చెప్తే వస్తారు అని నాకు చెప్పారు అందులో తప్పు ఏంటని ఆదిత్య అంటాడు. తెలిసిన వాళ్ళు మనం సాయం అందిస్తే తప్పేముందని దేవుడమ్మ కూడా సత్యని అంటుంది. అసలు నిఈ ప్రాబ్లం ఏంటి చిన్న పిల్ల వచ్చి అడిగినా కూడా నా వల్ల కాదు ఇంట్లో పని ఉందని చెప్పమంటావా అని ఆదిత్య సీరియస్ అవుతాడు. నీకు ఒక ఇల్లు ఉంది అది వదిలేసి వాళ్ళకి వీళ్ళకి సాయం చేస్తూ తిరుగుతావా అని సత్య కోపంగా అంటుంది.