రుక్మిణి ఆదిత్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. సరిగ్గా అప్పుడే దేవి గుడిలో నుంచి బయటకి వస్తుంటుంది వాళ్ళని చూస్తుందేమో అనే టెన్షన్ క్రియేట్ చేశారు. కానీ దేవి రావడం గమనించిన రుక్మిణి వెంటనే పైకి లేస్తుంది. నేను అడిగింది యాది పెట్టుకో సారు అని దేవి అంటుంది. ఏమడిగినావ్ బిడ్డ అని రుక్మిణి అంటుంది. నాయన నిన్ను చాలా బాధలు పెట్టాడు కదా ఆఫీసర్ సార్ ని వెతికి పట్టుకోమని చెప్పా అని చెప్పడంతో రుక్మిణి కళ్ల నిండా నీళ్ళతో అడిగింది చాలు పొద్దక అడిగి సార్ ని బాధపెట్టకు అని చెప్తుంది. అటు ఆదిత్య ఇంక ఇంటికి రాలేదని సత్య బాధగా ఎదురు చూస్తూ ఉంటుంది. పూజలో ఆదిత్య లేకపోవడంతో సత్య బాధపడుతుంటే అందరూ సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఆదిత్య ఇంటి బయట లేడని భాషా వచ్చి చెప్పడంతో సత్య అల్లడిపోతుంది. దేవుడమ్మ ఇంట్లో అందరూ భర్త కాళ్ళ మీద పది ఆశీర్వాదం తీసుకుంటారు.. కానీ సత్య మాత్రం ఆదిత్య లేకపోవడంతో ఏడుస్తుంది. భర్త విడిచిపెట్టిన కండువా మీద పడి ఆశీర్వాదం తీసుకోవచ్చని పూజారి చెప్పడంతో సత్య ఏడుస్తూ అలాగే చేస్తుంది. దేవి పిలిచిందని అలా ఆదిత్య అలా వెళ్ళిపోయాడు ఏంటి అని దేవుడమ్మ వాళ్ళు బాధపడతారు. దేవిని చూస్తే ఆదిత్య తనని తాను మరిచిపోతున్నాడు, బయట వాళ్ళు ఎవరైనా చూస్తే కన్న బిడ్డే అనుకుంటారని దేవుడమ్మ అంటుంది. 


Also Read: జైలు నుంచి బయటికి వచ్చేందుకు ఖైలాష్ ప్లాన్, కాంచనకి వేద క్షమాపణలు- ఖైలాష్ ని విడిపించమన్న మాలిని


రుక్మిణికి ఫోన్ వస్తుంది. అది గమనించిన దేవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. 'ఏంటే వదిలేసి పోయాడని నీకు నీ కూతురికి భయం లేకుండా పోయిందా.. నేను కొట్టింది తితీయింది అంటా నీ కూతురికి చెప్పేసావా.. దేవి నా గురించి ఎంక్వయిరీ చేస్తుందంట. మొగుడ్ని నేను కాకపోతే ఎవరు కొడతారు నిన్ను.. అయిన అలాంటి విషయాలు నా కూతురుకి చెప్పి నా పరువు తియ్యలని అనుకుంటున్నవా. ఆ మాధవ పంచన చేరేసరికి నీకు బాగా ధైర్యం వచ్చింది. నా చేతిలో చవల్సిన నిన్ను ఆ మధ్యవగాడు రక్షించి ఇంట్లో పెట్టుకున్న ఎందుకు చూస్తూ ఊరుకునాన్నో తెలుసా.. అయినా నేను నీకు ఫోన్ కొనిచ్చింది ఎందుకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చెప్తావనే కదా.. మరి కూతురు ఎంక్వయిరీ చేస్తుందని ఎందుకు చెప్పలేదు. నీకు భయం తగ్గింది. ఎప్పుడొకప్పుడు నాకు ఒంటరిగా దొరుకుతావ్ కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అయినా నా సంగతి తెలుసు కదా గుర్తు తెచ్చుకో ఆ పాత రోజుల్ని' అని ఫోన్ పెట్టేస్తాడు. అదంతా వింటూ దేవి కోపంతో రగిలిపోతుంది. ఇక దేవి నాన్నలా బాగానే మాట్లాడావని బాగానే అర్థం అయ్యింది, ఇంక ఆ సిమ్ తీసి పారేయి ఎంక్వయిరీ చేస్తే డౌట్ వస్తుందని మాధవ అనుకుంటాడు.  


Also Read: ఆదిత్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న రుక్మిణిని దేవి చూస్తుందా? తండ్రిపై ద్వేషంతో రగిలిపోతున్న దేవి


ఆదిత్య దేవి మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. దేవి నా కూతురు అని తెలిసిన వెంటనే ఇంటికి తీసుకురాకుండా తప్పు చేశాను. వాళ్ళు పరాయి ఇంట్లో తీసుకురాకుండా ఉండేసరికి ఆ మాధవ నా కూతురి ముందు నన్నే దుర్మార్గుడిని చేశాడు. మిమ్మల్ని ఇంటికి తీసుకురావడం ఎలాగో అర్థం కావడం లేదు.. ఇంక మిమ్మల్ని అక్కడే ఉంచితే ఆ మాధవ నా కూతురుని పూర్తిగా మార్చేస్తాడు. ఇన్నాళ్ళూ అమ్మ ఏమనుకుంటుందో అని తీసుకురాకుండా తప్పు చేశాను.. ఇక అమ్మ ఏమనుకున్న సరే రుక్మిణిని దేవిని ఇంటికి తీసుకురావాలని అనుకుంటాడు. దేవి ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని కోపంతో ఊగిపోతుంది. ఫోన్లో మా నాయన నెంబర్ ఉంటుంది కదా దానికి ఫోన్ చేసి మా నాయన్ని తిడతా అనుకుని ఫోన్ చేస్తుంది కానీ కలవదు. అది చూసిన రుక్మిణి నా ఫోన్ తో ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. నాయనకి ఫోన్ చేస్తున్నా.. ఇందాక నీ ఫోన్ కి నాయన ఫోన్ చేశాడు, నువ్వే ఫోన్ తీసావనుకుని నిన్ను తిట్టాడు, అప్పుడు నేను ఏం మాట్లాడలేకపోయాను, అందుకే ఇప్పుడు ఫోన్ చేసి తిడదామనుకున్న అని దేవి చెప్తుంది. నా ఫోన్ కి నాయన ఫోన్ చెయ్యడమెంటి అని రుక్మిణి అడుగుతుంది. ఇక దేవి జరిగిందంత చెప్తుంది. నా బిడ్డ మనసు పాడు చేయడానికి మాధవ సారు ఇలా చేస్తున్నవా ఉండు నీ సంగతి చెప్తా అని రుక్మిణి ఆవేశంగా వెళ్లబోతుంటే దేవి ఆపి నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. నాయన నిన్ను ఏం చెయ్యడు అని రుక్మిణి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుంది.