దేవి చాలా తెలివిగలది, నీలాగే పట్టుదల ఎక్కువ అని ఆదిత్య సంబరంగా రుక్మిణికి ఫోన్ చేసి చెప్తాడు. దేవమ్మకి అన్నీ నీ తెలివి తేటలే వచ్చాయ్ పెనీవీటి అని రుక్మిణి అంటుంది. రాధ, ఆదిత్య ఫోన్ లో మాట్లాడుకుంటే నాకు తెలుస్తుంది కానీ ఈ మద్య నేరుగా మాట్లాడుకుంటున్నారు, దాని వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదని మాధవ ఆలోచిస్తాడు. నేను రాధ ఫోన్ ట్యాప్ చేసిన విషయం తెలిసిందా ఆ విషయం తెలిసే ఛాన్స్ లేదు మరీ ఎందుకు బయట కలిసి మాట్లాడుకుంటున్నారు అని అనుమానపడతాడు. దేవిని వేరే స్కూల్ లో చేర్పించడంతో చిన్మయి ఒక్కటే అయిపోయిందని రామూర్తి దంపతులు మాధవ తో చెప్పి బాధపడతారు. రాధతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటారు. ఇక దేవి ఒక్కటే కూర్చుని చెస్ ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య రండి ఆడుకుందామని పిలుస్తుంది. ఇద్దరు కలిసి చెస్ ఆడుకుంటుంటే దేవుడమ్మ వచ్చి భోజనానికి పిలుస్తుంది. అవ్వా అన్నం తింటే నిద్ర వస్తది అని దేవి చెప్తుంది. ఆ మాటలకి గతంలో రుక్మిణి కూడా ఇలాగే అన్న విషయం గుర్తు చేసుకుని దేవుడమ్మ దేవిని దగ్గరకి తీసుకుని మురిసిపోతుంది. 


వేదని తక్కువ చేసి మాట్లాడొద్దని ఇంట్లో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన యష్- ఖుషి కస్టడీ కోసం ఫ్యామిలీ కోర్ట్ జడ్జిని యష్ ఇంటికి తీసుకొచ్చిన మాళవిక


ఇక గదిలో దేవుడమ్మ దేవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దేవిని చూస్తే మనకి పరాయి బిడ్డ లాగా అనిపించదు, తను ఇంట్లో కనిపిస్తేనే సందడిగా ఉంటుంది. దేవి మాట్లాడుతుంటే మన రుక్మిణి మాటలాగా అనిపిస్తుందని చెప్తుంది. దేవిని చూస్తే నా మనవరాలి లాగా అనిపిస్తుందని అంటుంది. నువ్వు రుక్మిణి గురించి ఆలోచిస్తుండటంతో అందరిలోనూ నీకు రుక్మిణి నే కనిపిస్తుందని దేవుడమ్మ భర్త ఈశ్వర ప్రసాద్ అంటాడు. దేవిని ఆ ఇంటి నుంచి రప్పించాలని మాధవ ఆలోచిస్తాడు. స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి దేవిని రమ్మని చెప్పమని అంటాడు. ఆ మాటకి దేవి జూనియర్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలకి  ప్రిపేర్ అవుతుందని ఆఫీసర్ గారు దగ్గర ఉంది ట్రైనింగ్ ఇస్తున్నారు. రేపు పోటీలో గెలిచిందంటే మీకే కాదు మాకు మంచి పేరు. మరి అలాంటప్పుడు పాపని పంపించమని మేము ఎలా చెప్తాం అని ఫోన్ పెట్టేస్తుంది. మాధవ ఫోన్ మాట్లాడటం రుక్మిణి వింటుంది. 


Also Read: హిమ క్యాన్సర్ నాటకాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శోభ, మరింత పగ పెంచుకున్న శౌర్య


'నా బిడ్డ పరాయి ఇంటికి ఏమైనా పోయిందా, వాళ్ళ నాయనకాడికి పోతే మీకేం బాధ, గిట్ల దొంగ చాటుగా పోనే చేసి రప్పించాలని ఎందుకు చూస్తున్నారు. మీ మాట మంచిగా లేదు, మీ దిమాక్ మంచిగా లేదు , నీ మనసులో ఏదో పెట్టుకుని తండ్రి బిడ్డలని వేరు చేయాలని చూస్తున్నారా' అని రుక్మిణి మాధవ మీద విరుచుకుపడుతుంది. అది రావలనుకున్నపుడే వస్తది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక దేవిని ఆదిత్య చెస్ పోటీలకు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆట మొదలు పెట్టిన పది నిమిషాల్లోనే ఎత్తు వేయాలని దేవికి ఆదిత్య చెప్పడంతో సరే అంటుంది. చూసినవ నువ్వు చెప్పిన టైం కంటే ఉండే చెక్ పెట్టిన ఇప్పుడు నువ్వు ఆడు నాయన అని దేవి అంటుంది. దేవి అలా అనేసరికి దేవుడమ్మ, ఆదిత్య అలాగే చూస్తుండిపోతారు.