దేవిని కలవడానికి ఆదిత్య స్కూల్ దగ్గరకి వస్తాడు. దేవి ఏడ్చుకుంటూ వెళ్ళి ఆదిత్యని కౌగలించుకుని ఏడుస్తుంది. మా నాయన వచ్చి పోయాడని చెప్తుంది. ఎప్పుడు వచ్చాడని అడుగుతాడు. ఇప్పుడే వచ్చాడు వెళ్లిపోయాడని చెప్తుంది. ‘ఆయనకి జ్వరం వచ్చింది అయినా నన్ను చూడటానికి వచ్చాడు. చాలా బాధగా ఉంది. మా నాయన మాకోసం వెతుక్కుంటూ వచ్చాడు. కానీ అమ్మ మాట్లాడలేదు. ఎంత చెప్పినా మాయమ్మ వినడం లేదు నాయన మొహం కూడ చూడటం లేదు. మీరు మా అమ్మకి చెప్పండి. మా అమ్మా నాయన్ని మీరు కలపండి’ అని దేవి అడుగుతుంది. మీరు కూడా మా నాయన మంచోడు కాదని ఆయన దగ్గరకి వెళ్లొద్దని చెప్పకండి అని దేవి అంటుంది. ఆ మాటలు విని ఆదిత్య చాలా బాధపడతాడు. మా నాయన్ని మమ్మల్ని ఒకటి చేస్తావా అని దేవి అడుగుతుంది. రెండు రోజులు సమయం ఇవ్వమని ఆదిత్య అడుగుతాడు.


జరిగింది అంతా రుక్మిణి తన తల్లి భాగ్యమ్మకి చెప్తుంది. నువ్వు ఊ అని చెప్పు వాడిని చంపి జైలుకి పోయి కూర్చుంటా అని ఆవేశపడుతుంది. చిన్మయి మొహం చూసి ఊరుకుంటున్నా అని రుక్మిణి చెప్తుంది. ఆ బిడ్డకి పాలిచ్చి తల్లిలాగా పెంచాను, కోపంలో మాధవ్ సారుని ఏమైనా చేస్తే ఆ బిడ్డ ఏం కావాలి అని రుక్మిణి బాధపడుతుంది. సత్య కమల బిడ్డతో కలిసి సంతోషంగా ఉంటుంది. అమెరికా ఎప్పుడు వెళ్తారని అడుగుతుంది కమల. అసలు ఆదిత్య తనతో మాట్లాడమే జరగడం లేదని తనని పట్టించుకోవడం లేదని సత్య తన బాధని చెప్పుకుంటుంది. ఎలాగైనా పటేల్ ని తీసుకుని అమెరికా వెళ్ళమని కమల చెప్తుంది. ఆ మాటలు విన్న దేవుడమ్మ ఆదిత్యకి చెప్పకుండానే మీరిద్దరు అమెరికా వెళ్తారని మాట ఇస్తుంది.


Also Read: వంటింట్లో ఇల్లాలు - ఇంట్లో ప్రియురాలు -బావుందయ్యా డాక్టర్ బాబు!


పిల్లల కోసం రుక్మిణి స్కూల్ దగ్గరకి వస్తుంది. చిన్మయి ఒక్కటే రావడం చూసి దేవి ఏది అని అడుగుతుంది. ఒక పిల్లని ఆపి దేవి ఏది అని అడుగుతారు. వాళ్ళ నన్న వస్తే దేవి తనతో వెళ్లిపోయిందని చెప్తుంది. అది విని రుక్మిణి షాక్ అవుతుంది. వెంటనే ఆదిత్య దగ్గరకి వచ్చి విషయం చెప్తుంది. దేవమ్మ కనిపించడం లేదు అంటే నేను అనుకున్నట్టే జరిగిందన్న మాట అని ఆదిత్య కూల్ గా చెప్తాడు. పొద్దున స్కూల్ దగ్గరకి వెళ్ళినప్పుడు దేవి వాళ్ళ నాన్న వచ్చాడని చెప్పినట్టు చెప్తాడు. ఆ సమయంలో దేవి చేతికి జీపీయస్ ట్రాక్ ఉండే వాచ్ పెడతాడు ఆదిత్య. దానితో దేవి ఎక్కడ ఉందో మనకి తెలుస్తుంది, వాడు దేవిని ఏమి చెయ్యలేడు. దేవీని అడ్డం పెట్టుకుని మనల్ని బాధపెట్టాలని చూస్తున్నాడు అంతే, వాడికి భయం ఎలా ఉంటుందో చూపిస్తే ఇంకోసారి దేవి జోలికి రాకుండా ఉంటాడని ఆదిత్య ధైర్యం చెప్పి రుక్మిణి పంపిస్తాడు.


దేవుడమ్మ రుక్మిణి గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటే సత్య, కమల ధైర్యం చెప్తారు. దేవి దొంగ తండ్రి అని తెలియక తండ్రికి సేవలు చేస్తూ ఉంటుంది. మీరిద్దరు నా కళ్ల ముందే ఉండాలంటే నేను ఏం చెయ్యాలని ఎమోషనల్ గా మాట్లాడి దేవిని తన వైపుకి తిప్పుకోవాలని చూస్తాడు మల్లికార్జున్.  


Also Read: మనసు మాట్లాడమంటోంది షరతు వద్దంటోంది - ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అంతే!