దేవితో నాన్న అని పిలిపించుకోవాలన్నా ఆశ రోజు రోజుకీ పెరిగిపోతుందని ఆదిత్య రుక్మిణి దగ్గర బాధపడతాడు. దేవికి నేనే కన్న తండ్రిని అని తెలియాలి ఇప్పటి వరకు మిస్ అయ్యింది చాలు దేవితో నాన్న అని నోరారా పిలిపించుకోవాలని ఎదురు చూస్తున్న అది జరిగే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా అంటాడు. వచ్చేలా నేను చేస్తానని రుక్మిణి అంటుంది. మాధవ్ రాధ మాటలు తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే దేవి, చిన్మయి సంతోషంగా వచ్చి దేవుడమ్మ అవ్వ మాకు బంగారు గాజులు గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్తారు. నాకు అయితే అక్కడ నుంచి రావాలని అనిపించలేదు బుజ్జి పాపతో ఆదుకోవాలని అనిపించిందని అంటూ ఉండగా రాధ వచ్చి ఆ మాటలు వింటుంది. అందరూ నన్ను సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారని దేవి సంబరంగా చెప్తుంది. నిన్ను అవ్వ ఎన్నిసార్లు అడిగిందో తెలుసా అని దేవి చెప్తుంది.


నువ్వు ఏమో చెయ్యాలని మస్త్ కథలు పడ్డావ్ కానీ నా బిడ్డకి వల్ల మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు వాళ్ళు కావాలని అనిపించినాకా నువ్వు అయితే ఆపలేవని రాధ అంటుంది. నువ్వు చాలా కలలు కంటున్నావ్ అని మాధవ్ అంటాడు. నా కల నిజం అయ్యే రోజు దగ్గరలోనే ఉందని అంటుంది. ‘నీ నమ్మకం నీది నా నమ్మకం నాది ఈ రాత్రి నీ ఆనందంతో ముగుస్తుంది, రేపు ఉదయం ఎవరి బాధతో మొదలవుతుందో తెలియదు కదా.. సరే ఉదయం కథ తెల్లవారినాక నీకే  తెలుస్తుంది ఈరోజుకి నీకు శుభరాత్రి’ అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మాధవ్ పూజ చెయ్యడం చూసి జానకి ఆశ్చర్యపోతుంది. హారతి తెచ్చి తీసుకోమని ఇంట్లో వాళ్ళకి ఇస్తాడు. ఎప్పుడు లేనిది కొత్తగా పూజ చేశావ్ ఏంటి అని జానకి అడిగితే చెప్పాను కదా పరీక్ష అని అది ఈరోజు రాయబోతున్నా అందుకే పూజ చేశానని చెప్తాడు.


Also Read: తులసి, సామ్రాట్ గురించి నీచంగా ఆర్టికల్- రచ్చ చేసిన అభి, అనసూయ బుర్రలో విషం నింపిన నందు, లాస్య


మాధవ్ ఏం చేయబోతున్నాడా అని రాధ ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న నీది ఈరోజు నాది.. చెప్పాను కదా నిన్న నీ నవ్వుతో ముగిసింది.. ఈరోజు నా ఆనందంతో ముగుస్తుందని మాధవ్ రాధని హెచ్చరించి వెళ్తాడు. ఆదిత్య ఫంక్షన్ లో ఎవరి కోసమో ఎదురు చూసిన విషయం గుర్తు చేసుకుని సత్య అదే విషయాన్ని అడుగుతుంది. కానీ ఆదిత్య అదేమీ లేదని చెప్తాడు. అప్పుడే ఫోన్ రావడంతో ఇంపార్టెంట్ కాల్ అనేసి పక్కకి వెళ్ళిపోతాడు. నా ముందు మాట్లాడుకుండా పక్కకి వెళ్ళిపోయాడు ఎవరై ఉంటారని సత్య అనుమానిస్తుంది. రుక్మిణి అదిత్యకి ఫోన్ చేసి 'మాధవ్ సారు మస్త్ కథలు పడుతున్నాడు. ఎప్పుడు లేనిది పొద్దునే లేచి పూజ చేశాడు, వాళ్ళ అమ్మ దగ్గర గోరుముద్దలు తిన్నాడు. ఏదో పరీక్ష అంటాడు నేనే గెలవాలి అంటాడు. వాళ్ళ అమ్మ ఏం పరీక్షలు అంటే ఏదో యజ్ఞం చేస్తున్నా నేనే గెలవాలి' అని అంటున్నాడని చెప్తుంది. కానీ వాడికి మాత్రమ భయపడను, ధైర్యంగా ఎదుర్కొంటాను కాకపోతే నీకు జరిగింది చెప్దామని ఫోన్ చేసినట్టు చెప్తుంది.


నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను దేవి నా కూతురు అని ఇంట్లో చెప్పేస్తాను. నా భయానికి నీ భయానికి ముగింపు పలుకుతాను. అందుకే దేవి నా కూతురు అనేది చెప్పేస్తాను. అక్కడ వాడి సంగతి నువ్వు చూసుకో ఇక్కడ దేవిని ఎప్పుడు ఈ ఇంటికి తీసుకురావాలో నేను చూసుకుంటాను అని ఆదిత్య అంటాడు. నీకు ఏది అనిపిస్తే అది చెయ్యమని చెప్తుంది. జానకి దేవుడమ్మ ఫంక్షన్ కి మనల్ని పిలిచింది. కానీ నువ్వు రాలేదు. మీ కోడలు ఎక్కడికి రాదు ఏంటి అని అడిగేసరికి నాకు బాధగా అనిపించింది. ఆమెకి నువ్వంటే చాలా అభిమానం అని చెప్తుంది. ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావ్ నలుగురితో తిరిగి నలుగురుతో మాట్లాడాలి అని చెప్తుంది. నా అనుకునే వాళ్ళని వదిలేసి వచ్చినా అని రాధ అనేసరికి అదేంటి అసలు నీ బాధ ఏంటి ఎందుకు ఇలా ఉంటున్నావ్ అని జానకి అడుగుతుంది. మొహం చాటేసి బతకాల్సిన అవసరం ఏముంది? నీ భర్త చూస్తాడని ఏమైనా అంటాడని భయం ఉందా? అతను ఎవరో చెప్పు మేము మాట్లాడతాము అని అంటుంది.    


Also Read: రాధ, మాధవ్ ల సవాల్- రుక్మిణి ఈ ఇంటి దేవత అంటోన్న దేవుడమ్మ