దేవుడమ్మ ఇంట్లో బారసాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడే భాగ్యమ్మ వస్తుంది. ఇప్పుడా రావడం చుట్టంలాగా వస్తున్నావ్ ఇంట్లో ఉండి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా అని దేవుడమ్మ అంటుంది. ఈ వేడుకలో రుక్మిణి కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని దేవుడమ్మ బాధపడుతుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి భాగ్యమ్మని పలకరిస్తారు. మా ఇంట్లో ఉండటం ఇబ్బందిగా ఉందా ఏంటి అని సూరి భాగ్యమ్మని అడుగుతాడు. అదేమీ లేదు పటేలా అంటే మరి ఎందుకు ఉండటం లేదు నేను కడుపుతో ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకోలేదు నొప్పులు పడుతుంటే హాస్పిటల్ కి వచ్చి బయటదానిలా చూసి పోయావు, నేను ఉన్నా గాని నన్ను విడిచిపెట్టి పోయావంటే ఎక్కడ ఉన్నావో చెప్పు అని కమల నిలదిస్తుంది. ఎక్కడ ఉంటాను మన ఇంట్లోనే ఉంటాను అని భాగ్యమ్మ అంటే అయితే అదే మాట నా బిడ్డ మీద ఒట్టు పెట్టి చెప్పమని అడుగుతుంది. ఆ మాటకి భాగ్యమ్మ నా బిడ్డతాన ఉంటున్నా అనేసరికి అందరూ షాక్ అవుతారు. నీ బిడ్డ ఇంకెవరూ ఉన్నారని దేవుడమ్మ అడుగుతుంది. నా బిడ్డ అంటే నా ఇంట్లోనే నా బిడ్డ ఆడింది పాడింది అక్కడే కదా ఆ ఇంట్లోనే అందుకే అక్కడే ఉంటున్నాను. రుక్కవ్వ బతికే ఉందని అంటున్నారు ఈ ఇంటికి రాకపోయినా తను నాదగ్గరకి అయినా వస్తుందేమో అని చిన్న ఆశ.. అందుకే నా ఇంట్లోనే నా బిడ్డ కోసం ఎదురు చూస్తా కూర్చున్నా ఆదేమన్నా తప్పా అని అనడంతో అందరూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు.
Also Read: మన పెళ్లి ఎప్పుడని అభిని నిలదీసిన మాళవిక- యష్ మీద పగ తీర్చుకోవడానికి అభికి దొరికిన అస్త్రం
రాధ దేవుడమ్మ ఇంటికే వెళ్లబోతుంటే మాధవ వస్తాడు. ఏంటి ఆ ఇంటికేనా అని అంటే ఆ ఇంటికి కాదు మా ఇంటికి అని రాధ చెప్తుంది.
మాధవ: మీ ఇంటిని వదిలేసి చాలా కాలం అయ్యింది కదా వద్దు రాధ వెళ్తే ఇబ్బంది పడతావ్
రాధ: ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను
మాధవ: వెళ్లాలని డిసైడ్ అయ్యవన్నమాట.. వెళ్ళే ముందు నాకు ఒక మాట చెప్తే బాగుంటుంది కదా
రాధ: ఏంది నీకు చెప్పేది నువ్వు ఎవరని చెప్పాలి. నా మెట్టినింటికి పోతున్నా నా పెనిమిటి ఇంట్లో వేడుక జరుగుతుంది పోతున్నా నీకెందుకు చెప్పాలి
మాధవ: నీకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే నాకు చెప్పి వెళ్లాలి
రాధ: గది నా ఇల్లు నా ఇంట్లో నాకేంటి ఇబ్బంది. నేను అక్కడ లేకపోయినా అది నా ఇల్లు అక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు. నా వాళ్ళ నీడ పడినా చాలు నేను సంతోషంగా ఉండటానికి. నేను విడిచిపెట్టిన సంతోషం వెతుక్కోడానికి పోతున్నా నా దారిన నన్ను పోనివ్ ఇసువంటప్పుడు అడ్డు పడితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
ఆ ఆదిత్య ఉన్నాడనే ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావ్. నీ ఆనందం ఆవిరి అయ్యేలా ఒక మంచి షాక్ ఇస్తాను చూస్తూ ఉండు అని మాధవ ఎవరికో ఫోన్ చేస్తాడు. ఇక దేవి వాళ్ళు దేవుడమ్మ ఇంటికి వస్తారు. అందరినీ పలకరిస్తుంది కానీ దేవిని పలకరించదు. మీ అమ్మని తీసుకొస్తా అని మాటిచ్చి తీసుకురాకుండా వచ్చావ్ కదా అని బుంగమూతి పెడుతుంది. మా రాధ ఎవ్వరి ఇంటికి వేడుకకి రాదు తనని బలవంత పెట్టడం ఎందుకని మేము వదిలేశామని రామూర్తి చెప్తాడు. బారసాల వేడుక మొదలవుతుంది. ఆదిత్య, సత్యని బిడ్డని తీసుకుని ఉయ్యాలల్లో పడుకోబెట్టమని చెప్తుంది దేవుడమ్మ. కానీ దేవి ఆపుతుంది తను నాకు ఏమవుతుందని అడిగితే ఆదిత్య చెల్లి అని చెప్తాడు. అయితే నా చెల్లిని నేనే పడుకోబెడతా అని అంటుంది. దేవుడమ్మ సరే అనడంతో దేవి బిడ్డని తీసుకుని ఉయ్యాల్లో వేస్తుంది. అదంతా రుక్మిణి చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇంటి బిడ్డవమ్మ అన్ని నువ్వే చెయ్యాలి ఆ విషయం మేము మర్చిపోయామని ఆదిత్య అంటాడు.
Also Read: రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి
దేవమ్మ ఈ ఇంటి బిడ్డ అని తెలిస్తే అత్తమ్మ ఎంత ఖుషి అవుతుందో.. భగవంతుడా ఈ ఇంటి బిడ్డని ఈ ఇంటికి త్వరగా చేరేలా ఆశీర్వదించమని రుక్మిణి మనసులో కోరుకుంటుంది. ఇక పంతులుగారు పాప చెవిలో పేరు చెప్పమని చెప్తాడు. బిడ్డకి రుక్మిణి అని పేరు పెడుతుంది దేవుడమ్మ. దేవి సంతోషంగా రుక్మిణి రుక్మిణి అని పిలుస్తుంది. అదంతా చూసి రుక్మిణి చాలా సంతోషిస్తుంది. ఆ పేరు పెట్టినందుకు ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు. అప్పుడే ఆదిత్య రుక్మిణి చూసి షాక్ అవుతాడు.