దేవుడమ్మ జానకికి ఫోన్ చేస్తుంది. కమలకి పాప పుట్టింది, రేపు బారసాల చేస్తున్నాం మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్తుంది. మీరు ఇంతగా పిలిచిన తర్వాత కూడా రాకుండా ఉంటామా అని జానకి అంటుంది. ఇప్పటి వరకు మీ అమ్మ ఎప్పుడు రాలేదు ఈసారి మాత్రం తనని కూడా తీసుకుని రా అని దేవితో చెప్తుంది. మాయమ్మని తీసుకుని వస్తాను అని దేవుడమ్మ అవ్వకి మాట ఇచ్చినా తను కచ్చితంగా రావాల్సిందే అని దేవి అంటే ఇన్నేళ్లలో మీ అమ్మ ఏ పేరంటానికి పిలిచినా రాలేదమ్మా అలాటిది ఇప్పుడు వస్తుందంటావా అని జానకి అంటుంది. అక్కడే ఉన్న మాధవ కోపంగా చూస్తూ ఉంటాడు. రుక్మిణి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. రేపు కమలక్క బిడ్డకి బారసాల కదా అందరినీ పిలిచినట్టే నన్ను కూడా పిలిచింది ఈ ఒక్క సారి నాకు రావాలని అనిపిస్తుంది పెనిమిటి. ఇన్ని దినాలు నాతో మాట్లాడలేదని ఏ పొద్దు ఎదురు పడలేదని అత్తమ్మ అనుకుంది. కానీ కమలక్క బిడ్డని చూడాలని అనిపిస్తుందని చెప్తుంది.


Also Read: వాయమ్మో ఏందయ్యా ఈ రచ్చ- చిందులేసిన నందు, సామ్రాట్- తలలు పట్టుకున్న తులసి, లాస్య


ఎలా రుక్మిణి ఇంటి దాకా వస్తే ఎవరో ఒకళ్ళు చూస్తారు కదా అని ఆదిత్య అంటాడు. అదే అర్థం కావడం లేదు మా అక్కకి బిడ్డ పుడితే నేను చిన్నమ్మని అవుతా.. నేను కండ్లారా చూడకుండా ఎలా ఉంటాను అని బాధపడుతుంది. నువ్వు ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళడం ఉండదు రుక్మిణి అని ఆదిత్య అంటాడు. అదంతా నాకు తెలియదు నేను ఇంట్లో నుంచి వచ్చినాక జరుగుతున్న మొదటి వేడుక అందరూ ఉంటారు, మరి నేను లేకపోతే ఎలా ఏదైతే అది అయ్యింది నేను వస్తాను పెనిమిటి అని రుక్మిణి చెప్తుంది. ‘ఎప్పుడు రాను అనే రుక్మిణి వస్తాను అంటుంటే కూడా నా భార్యని ఇంటికి రమ్మని అనలేకపోతున్నాను. రుక్మిణి వస్తే పరిస్థితి ఏంటి’ అని ఆదిత్య ఆలోచనలో పడతాడు.  


దేవుడమ్మ ఇంట్లో బారసాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అదంతా చూసిన కమల ఎమోషనల్ అవుతుంది. 'రుక్మిణికి బిడ్డ ఉందని అంటున్నారు కానీ ఆ బిడ్డకి నేనేమీ చెయ్యలేకపోతున్నాను అందుకే ఈ బిడ్డని నా బిడ్డ అనుకుని ఘనంగా చేస్తున్నాను. రామూర్తి వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ రమ్మన్నాను. దేవికి వాళ్ళ అమ్మని కూడా తీసుకురమ్మని మరి మరి చెప్పాను. దేవి తీసుకొస్తాను అన్నదంటే తీసుకొస్తుంది' అని దేవుడమ్మ ఆదిత్యతో చెప్తుంది. కమల దేవుడమ్మ దంపతులకి దణ్ణం పెడుతుంది. 'ఎందుకమ్మా మామీద ఇంత అభిమానం. మాకోసం ఇంత చేస్తున్నారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి. పుట్టింది మీ బిడ్డా కాదు, మీ ఇంటి కోడలిని కాదు కానీ నా బిడ్డకి మీరు ఇంత చేస్తున్నారు’ అని కమల బాధగా అడుగుతుంది. ‘నువ్వు మా రుక్మిణి అక్కవి మేము కాక ఇంకెవరూ చేస్తారు, రుక్మిణి ఈ ఇంట్లోకి వచ్చాకే ఈ దేవుడమ్మ మారింది. అందరూ నన్ను దేవుడమ్మ అంటారే కానీ నిజానికి రుక్మిణీయే ఈ ఇంటి దేవత. నువ్వు రుక్మిణి, సత్య కలిసి పెరిగారు ప్రాణంలా బతికారు. మిమ్మల్ని విడదీసి చూడగలనా? ఈ ఇంట్లో బిడ్డ కేరింతలు వినాలని ఎప్పటి నుంచో ఆశపడుతుంటే నీ బిడ్డ నా కోరిక తీర్చింది. దాని కోసం ఇంత మాత్రం కూడా చెయ్యలేనా. ఆ బిడ్డ నీ కడుపున పుట్టినా మీ అక్కాచెల్లెళ్ల రక్తం ఒక్కటే కదా ఆ బిడ్డలోనే నేను నా రుక్మిణి బిడ్డని చూసుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నాను అంటే అది రుక్మిణి వల్లే.. నాకు నువ్వు వేరు రుక్మిణి వేరు కాదు’ అని దేవుడమ్మ అంటుంది.


Also Read: రెచ్చిపోతే సచ్చిపోతావంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన రాధ - భాగ్యమ్మ చివరి కోరిక రుక్మిణి తీరుస్తుందా?


రామూర్తి దంపతులు రెడీ అయ్యి ఉంటారు. దేవి వచ్చి రుక్మిణిని పిలుస్తుంది. ఇంట్లో పనులు చక్కబెట్టి వస్తా ముందు మీరు వెళ్ళండి అని చెప్తుంది. నువ్వు ఎప్పుడు ఇంతే ఎక్కడికి రావు అవ్వకి నిన్ను తీసుకొస్తా అని మాట ఇచ్చాను నవ్వు రా పిలుస్తుంది. వస్తానులే అని తనని పంపించేస్తుంది. దేవి మొహం మాడ్చుకుంటుంది. రాధ ఎప్పుడు అంతే ఎక్కడికి రమ్మన్నా రాదు అని జానకి అంటే ఆ అమ్మాయికి నచ్చని పని చెయ్యడం ఎందుకు మనం వెళ్దాం పదండి అని రామూర్తి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు.