సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత హీరోయిన్లపై ట్రోలింగ్ చాలా కామన్ అయిపోయింది. మొదట్లో ఒకరిద్దరు హీరోయిన్లు ఈ ట్రోలింగ్ పై స్పందించేవారు కానీ ఆ తరువాత లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ట్రోలింగ్స్ పై కొన్ని బాధపెట్టే కామెంట్స్ కూడా ఉంటాయి. కొంతమంది బాడీషేమింగ్ కామెంట్స్ కూడా చేస్తూ హీరోయిన్లను ఇబ్బంది పెడుతుంటారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కి కూడా ఇలాంటివి ఎదుర్కోక తప్పలేదు.
తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది దీపికా. కెరీర్ మొదలుపెట్టిన ఆరంభంలో ఓ వ్యక్తి తనను బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకోమని సలహా ఇచ్చాడని చెప్పింది. అప్పుడు తన వయసు 18 ఏళ్లని.. అతడు ఇచ్చిన సలహాకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక సైలెంట్ గా ఉండిపోయానని.. సీరియస్ అవ్వకుండా ఎలా ఉన్నానో ఇప్పటికీ అర్ధం కాదని చెప్పుకొచ్చింది.
ఈ బ్యూటీ నటించిన 'గెహరాయియా' సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. దీపికా మాత్రం జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఇందులో భాగంగా జీవితంలో ఎదురైన అతి చెత్త సలహా ఏంటంటూ.. దీపికా పదుకోన్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఈ బ్యూటీ.. తన బ్రెస్ట్ సైజ్ పెంచుకోమని ఇచ్చిన సలహానే అతడి చెత్త సలహా అని చెప్పుకొచ్చింది.
అయితే ఈ సలహా ఎవరు ఇచ్చారనే విషయాన్ని మాత్రం దీపికా బయటపెట్టలేదు. ఇక షారుఖ్ ఖాన్ ను తన జీవితంలో బెస్ట్ సలహా ఇచ్చిన వ్యక్తిగా పేర్కొంది దీపికా. తెలిసిన వాళ్లతో సినిమాలు చేయమని షారుఖ్ చెప్పారట. సినిమాలు చేయడమంటే కేవలం నటించడం కాదని.. జీవితంలో ఓ భాగమని.. కాబట్టి కొన్ని జ్ఞాపకాలను, అనుభవాలను పొందే క్రమంలో తెలిసినవాళ్లతో ట్రావెల్ చేయడమే మంచిదని చెప్పినట్లు దీపికా వివరించింది.