నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. బతుకమ్మ పాటతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని, మహానటి బ్యూటీ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.



తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఊర మాస్ లుక్ లో నాని సరికొత్తగా కనిపించాడు. గతంలో ఎప్పడూ చూడని నానిని ఈ ట్రైలర్ లో చూపించారు. కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది. అదిరిపోయే ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులు ‘దసరా’ సినిమాలో నాని ధరణిగా నటిస్తున్నాడు. హీరో, హీరోయిన్లు పూర్తి స్థాయిలో డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా హింసతో చెలరేగిపోయాడు నాని. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 






ట్రైలర్ ‘చిత్తు చిత్తుల గుమ్మ’ అంటూ బతుకమ్మ పాట ప్రారంభం అయ్యింది. హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి కూతురు గెటప్ లో కనిపించింది. “నా లాంటి అమ్మాయి దొరికిందంటే ధరణిగా పెట్టి పుట్టావురా నాకొడకా” అంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటున్నది. “ఒక్కొక్కనికి మొల్తాడు కింద గుడాల్‌ రాల్తయ్‌ బ్యాంచెత్‌” అంటూ నాని చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ నటన, నాని ఫైట్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.


Also Read బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - నందమూరి తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్ 


ఈ సినిమాను తెలంగాణ గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల చుట్టు పక్కల ఇరు వర్గాల మధ్యన జరిగే గొడవను బేస్ చేసుకుని రూపొందించారు. మార్చి 30న పలు భాషల్లో ‘దసరా’ విడుదల పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈసినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తొలి నుంచి ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ నెల 30న అట్టహాసంగా విడుదల కాబోతుంది.


Read Also: ఒక ఎన్టీఆర్, ఒక చిరు, ఒక రాజమౌళి - టాలీవుడ్‌కు నడక నేర్పారు, ఉనికి చాటారు, ఎల్లలు దాటించారు!