'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ కు వ్య‌తిరేకంగా తాను కూడా బ‌రిలో నిలుస్తున్న‌ట్టు సీవీఎల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోను కూడా ప్ర‌క‌టించారు. తరువాత ఏమైందో తెలియ‌దు కానీ.. ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్రకటించి షాకిచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రకాష్ రాజ్‌పై ఆరోప‌ణ‌లు చేసి వార్తల్లో నిలిచారు సీవీఎల్ నరసింహారావు. ప్రకాష్ రాజ్ ను ఓడించమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 


Also Read: 'మా' ఎలెక్షన్స్.. ఎన్టీఆర్ ఇలా బుక్కైపోయాడేంటి..?


దేశమన్నా, ధర్మమన్నా చులకన భావం ఉన్న ప్రకాష్ రాజ్ ను గెలిపించొద్దంటూ సభ్యులను రిక్వెస్ట్ చేశారు. రెండు ప్యానెల్స్ లో ఉన్న తెలంగాణ బిడ్డలను గెలిపించకపోతే సినీ పరిశ్రమకు మంచిది కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 'మా' సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తూ.. తెలంగాణ బిడ్డలైన ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ ను గెలిపించాలని కోరారు. 


తెలంగాణలో ఉన్న 'మా'లో ఇక్కడి వారిని గెలిపించకపోతే సినిమా పరిశ్రమకు, సమాజానికి మంచిది కాదని అన్నారు. దేశమన్నా, దేవుడన్నా, ధర్మమన్నా చులకన భావన ఉన్న ప్రకాష్ రాజ్ ను తప్పకుండా ఓడించమని చెప్పారు. అనేక వివాదాస్పద అంశాలతో ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. 'నేను.. నేను' అనే మాట తప్ప మరొక విషయం పట్టని వ్యక్తి అని.. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని సీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు.    


ప్రకాష్ రాజ్‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ద్వారా.. ఆయ‌న మ‌ద్ద‌తు ఎవ‌రికో చెప్ప‌క‌నే చెప్పారు సీవీల్. మొత్తానికి టాలీవుడ్‌ లో లోక‌ల్‌, నాన్ లోక‌ల్ అనే ఫీలింగ్‌ ని బ‌లంగా తెర‌పైకి తేవ‌డంలో ఒక వ‌ర్గం స‌క్సెస్ అయ్యింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


Also Read: ‘మా’ ఎన్నికలు.. దీనికి కూడా బయట వాళ్లు ఎందుకు? దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు


Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత


Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?


Also Read: ''కోట్లలో సంపాదించే సమంతకు పాకెట్‌మనీ మాత్రమే ఇచ్చేవారు..''


Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!


Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి