Super Craze For GROUND Movie: ఒక్కోసారి భారీ బడ్జెట్ పెట్టి, మంచి పేరున్న నటీనటులను పెట్టి, భారీగా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసే సినిమాలు బాక్సీఫీస్ దగ్గర బోల్తా పడతాయి. ప్రేక్షకులకి అస్సలు నచ్చవు. ఫ్లాప్ గా నిలుస్తాయి. కానీ, కొన్ని సినిమాలు అలాకాదు. నటీనటులు ఎవరో తెలీదు. భారీ బడ్జెట్ లు ఉండవు. ప్రమోషన్స్ ఉండవు. అసలు అలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయ్యిందా? అని కూడా ఎవ్వరికీ తెలీదు. అలాంటి సినిమాలు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటాయి. క్రిటిక్స్ ని సైతం అట్రాక్ట్ చేస్తాయి. గతంలో టాలీవుడ్ లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఇక ఇప్పుడు ‘గ్రౌండ్’ అనే ఈ సినిమా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొత్త నటులతో, కొత్త దర్శకుడితో తెరకెక్కించిన ఈ సినిమాకి ఎందుకింత క్రేజ్? ఒకసారి చూద్దాం.
చిన్ననాటి జ్ఞాపకాలు..
దాదాపు సినిమాలన్నీ రియాల్టీకి దగ్గర్లోనే ఉంటాయి. మన జీవితంలో జరిగే విషయాలనే చాలామంది తెరకెక్కిస్తుంటారు. కానీ, వాళ్లు తీసే విధానం, వాళ్లు అందులో చూపించే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అలాంటి సినిమానే ‘గ్రౌండ్’. చిన్నప్పుడు ఆదివారం వస్తే చాలు ఆడుకోవడం, టీవీ చూడటం లాంటివి చేసేవాళ్లం. అలా ఆదివారం వస్తే చాలు గ్రౌండ్ కి వెళ్లి ఆడుకునే అబ్బాయిల కథే ఈ సినిమా. ఒకేరోజు, ఒకే లొకేషన్ లో జరిగే కథ ఈ సినిమా. దీంట్లోనే లవ్ స్టోరీ, ఎమోషన్స్ అన్నీ చూపించారు . ఒక్కసారిగా మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు.
ఆసక్తిగా ట్రైలర్..
ఫిబ్రవరి 23న రిలీజైంది ఈ చిన్న సినిమా. ఈ సినిమా ట్రైలర్ చాలామందిని ఆకట్టుకుందనే చెప్పాలి. ఒక అమ్మాయి తన జీవితం గురించి, తన ప్రేమ గురించి ఈ ట్రైలర్ లో చెప్తున్నట్లుగా కట్ చేశారు. దాంట్లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ చూపించారు. చివరికి "ఒక్క రోజులో జీవితం ఎలా మలుపు తిరిగిందో" అంటూ ముగించారు. దీంతో ఏం జరిగిందా? అనే ఆసక్తిని కలిగించారు. ఈ సినిమాకి సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెరిగింది. స్టూడెంట్స్ తీసిన ఈ సినిమాకి ప్రతి ఒక్కరు టాప్ రేటింగ్స్ ఇస్తున్నారు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కేవలం 8 స్క్రీన్ లలో రిలీజైనప్పటికీ మంచి టాక్ తెచ్చుకుంటుంది ఈ సినిమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కథేంటంటే?
ఆదివారం వస్తే దగ్గర్లో ఉండే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునే కుర్రాళ్ళ కథ ‘గ్రౌండ్’. ఆదివారం క్రికెట్ ఆడటానికి వచ్చే కుర్రాళ్ళు వేరే టీంతో పోటీకి బెట్టింగ్ కట్టడం, ఆ క్రికెట్ చూడటానికి వచ్చే అమ్మాయిలు, ఆ గ్రౌండ్ లోనే క్రికెట్ ఆడే కుర్రాళ్ళ మధ్య ప్రేమ. బెట్టింగ్ మ్యాచ్ కాస్త సీరియస్ గా మారడంతో రెండు గ్రూపుల మధ్య గొడవ జరుగుతుంది. ప్రేమికుల మధ్య గొడవలతో సాగింది. మరి ఆ గొడవలు ఏంటి? గొడవ తర్వాత ఏమైంది? గ్రౌండ్ కథేంటి? ప్రేమ జంటల కథేంటి తెలియాలంటే తెరపై గ్రౌండ్ సినిమాని చూడాల్సిందే. నటీనటుల విషయానికొస్తే.. అందరూ కొత్తవాళ్లే. క్రికెట్ టీం కెప్టెన్ గా హరి, ముగ్గురు అమ్మాయిలు తేజస్విని, దుర్గా భవాని, ప్రీతీ చక్కగా నటించారు. ఈ సినిమాకి సూరజ్ డైరెక్షన్ చేయగా సినీ కోడ్ స్టూడియోస్ నిర్మించింది.
Also Read: అందుకే ‘యానిమల్’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోయా: రష్మిక