Rashmika Insta Post About Animal Movie: వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న హీరోయిన్ల‌లో ఒక‌రు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న‌. ఇటీవ‌ల ఆమె న‌టించిన చిత్రం ‘యానిమల్‌’ భారీ సక్సెస్ న‌మోదు చేసింది. ఎన్నో అవార్డుల‌ను సొంతం చేసుకుంది. అటు బాక్సా ఫీస్ ద‌గ్గ‌ర‌, ఓటీటీలో కూడా బంప‌ర్ హిట్ కొట్టింది. అయితే, ఆ స‌క్సెస్ పై ర‌ష్మిక మంద‌న ఎక్క‌డా స్పందించ‌లేదు. ఎక్క‌డా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం కానీ, ఫంక్ష‌న్స్‌లో క‌నిపించ‌డం కానీ జ‌ర‌గలేదు. దీంతో బీ టౌన్‌లో, ఆమె అభిమానుల్లో ఇది పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ఆమె ఎందుకు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు? అంటూ ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. అయితే, ఎట్ట‌కేల‌కు ఆ విష‌యంపై స్పందించారు ర‌ష్మిక‌. ఎట్ట‌కేల‌కు ఇన్ స్టా పోస్ట్ ద్వారా స‌మాధానం చెప్పారు. మ‌రి ఏమ‌న్నారంటే? 


షూటింగ్స్‌లో చాలా బిజీగా ఉన్నాను


‘‘ఎస్.. ఇప్పుడు మాట్లాడాల్సిన టాపిక్.. నేను ఎందుకు స‌క్సెస్‌ను ఎంజాయ్ చేయ‌డం లేదు అని. నాకు తెలుసు ఇవి ప్రేమ‌, అభిమానం వ‌ల్లే వ‌స్తున్నాయి. యానిమ‌ల్ టీమ్ అందించిన భారీ చిత్రాన్ని ప్ర‌జ‌లు ఆనందించారు, ఆద‌రించారు, ప్ర‌శంస‌లు కురిపించారు. ఆ విజ‌యాన్ని నేను ఆస్వాదించాలి అనుకున్నాను. టైం కేటాయించాలి అనుకున్నాను. కానీ, ఆ సినిమా విడులైన మ‌రుస‌టి రోజు నుంచే నేను వేరే సినిమా షూట్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. అది నా కెరీర్ లోనే చాలా ముఖ్య‌మైన‌, పెద్ద ప్రాజెక్ట్. ఇంటర్వ్యూల్లోనూ, స‌క్సెస్ పార్టీల్లోనూ పాల్గొనలేకపోయా. ప్రతిష్ఠాత్మక చిత్రాల షూటింగ్స్‌ కోసం రాత్రిళ్లు కూడా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. మీరు నన్ను మిస్‌ అవుతున్నారని నాకు తెలుసు. ఆ లోటును నేను నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల ద్వారా భర్తీ చేస్తాన‌ని భావిస్తున్నా. అవి మిమ్మల్ని క‌చ్చితంగా అలరిస్తాయి. మీరు వాటిని చూస్తూ ఎంజాయ్‌ చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అన్నింటికీ మించి మీ ప్రేమే నాకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు ర‌ష్మిక‌. 


ముఖం క‌నిపించ‌కుండా ఫొటోలు.. 


ఇక చాలా రోజుల త‌ర్వాత ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు ర‌ష్మిక‌. అయితే, ఆ ఫొటోల్లో ఆమె ముఖం పూర్తిగా క‌నిపించ‌లేదు. ముఖానికి అడ్డంగా ఫోన్‌ పెట్టారు. తన కొత్త సినిమాలోని పాత్ర కోసం రెడీ అయ్యాయని, అందుకే ఫుల్‌ ఫేస్‌ చూపించలేకపోతున్నానని చెప్పారు. చిత్ర బృందం అధికారికంగా త‌న ఫొటోలు రిలీజ్ చేసిన‌ప్పుడు మాత్ర‌మే త‌ను కూడా రిలీజ్ చేయ‌గ‌ల‌న‌ని చెప్పారు. అందుకే, ఎలాంటి ఇంట‌ర్వ్యూలు, పోస్ట్ లు పెట్ట‌డం లేద‌ని రాసుకొచ్చారు ర‌ష్మిక‌. అయితే, అంత పెద్ద‌, ముఖ్య‌మైన ప్రాజెక్ట్ ఎంటో మాత్రం రివీల్ చేయ‌లేదు ఆమె.  ఇక ప్ర‌స్తుతం ర‌ష్మిక చేతిలో ‘పుష్ప 2’, ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘ఛావా’  అనే సినిమాలు ఉన్నాయి. దీంతో ఆమె ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నార‌ని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 






రణబీర్ క‌పూర్, ర‌ష్మిక న‌టించిన ‘యానిమ‌ల్’ సినిమా ఎంత భారీ విజ‌యాన్ని అందుకుందో అంద‌రికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఎన్ని ప్ర‌శంస‌లు ద‌క్కాయో, అంతే రేంజ్ విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. 


Also Read: ప్లానింగ్‌తోనే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు, వ‌రుణ్ తేజ్‌పై మెగాస్టార్ కామెంట్స్