Allu Ayaan croons Dunki song : టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్ కిడ్స్ లో అల్లు అర్జున్ పిల్లలు ముందు మనసులో ఉంటారు. అటు బన్నీ ఇటు స్నేహ.. ఇద్దరు తమ పిల్లలు అయాన్, అర్హ లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గర చేస్తుంటారు. ఇప్పటికే అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఇచ్చేసింది. సమంత నటించిన 'శాకుంతలం' సినిమాలో అర్హ... భరతుడి పాత్రలో తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో అలరించిన విషయం తెలిసిందే.


అయాన్ సైతం తన అల్లరితో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు. తను చేసే చిలిపి పనులకు అల్లు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతుంటారు తాజాగా అయాన్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ ఈ వీడియోలో అయాన్ షారుక్ ఖాన్ సినిమాలోని పాటను పాడాడు. దీంతో ఈ వీడియో ఏకంగా షారుక్ ఖాన్ వరకు చేరింది. వెంటనే షారుక్ ఈ వీడియోకి రిప్లై ఇచ్చాడు.


షారుఖ్ ఖాన్ 'డంకీ' సాంగ్ పాడి అదరగొట్టిన అయాన్


కారులో వెళ్తున్న అయాన్ షారుఖ్ ఖాన్ నటించిన 'డంకీ' సినిమాలోని 'లుటు పుటు గయా' పాటని సరదాగా పాడాడు.. ఈ పాట పాడుతుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయాన్ సరదాకి పాడినా.. పాట మాత్రం అదరగొట్టేసాడు. దీంతో అయాన్ పాట పాడిన వీడియో బన్నీ ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ ని సైతం తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ అయాన్ 'ఫ్యూచర్ ఐకాన్ స్టార్'అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియోని ఏకంగా షారుక్ ఖాన్ కి ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త షారుక్ ఖాన్ దగ్గరికి చేరింది. వీడియో చూసిన షారుక్ వెంటనే రిప్లై కూడా ఇచ్చాడు.






అయాన్ పాటకి ఫిదా అయిన షారుక్..


ట్విట్టర్ లో ఈ వీడియోని చూసిన షారుక్ ఖాన్ అయాన్ పాటకి ఫిదా అయిపోయాడు. దాంతో ట్విట్టర్ వేదికగా ఈ వీడియోకి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఈ మేరకు షారుక్ ట్వీట్ చేస్తూ.." థ్యాంక్యూ లిటిల్ వన్.. నువ్వు ఫ్లవర్, ఫైర్ రెండూ కలగలిసిన ఒకడివి. ఇప్పుడు నా పిల్లలకి కూడా అల్లు అర్జున్ శ్రీవల్లి సాంగ్ పాడడం ప్రాక్టీస్ చేయిస్తున్నాను.. హా.. హా" అంటూ పేర్కొన్నారు. దీంతో షారుక్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


అల్లు అయాన్.. మోడల్ బోల్తే


ఇటీవల అల్లు అర్జున్ బెర్లిన్ వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సమయంలో ఓ అభిమాని.. అల్లు అయాన్ అంటూ గట్టిగా అరిచారు. వెంటనే బన్నీ స్పందిస్తూ 'మోడల్ బోల్తే' అంటూ మోడల్ సింబల్ చూపించారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా గట్టిగా అరుస్తూ సందడి చేశారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అప్పటినుంచి ఫ్యాన్స్ అంత అయాన్ ని మోడల్ అని పిలవడం మొదలుపెట్టారు.


షారుక్ ట్వీట్ కి బన్నీ రిప్లై


తన కొడుకు పాటకి ఫిదా అవుతూ షారుక్ చేసిన ట్వీట్స్ కి బన్నీ రిప్లై ఇచ్చాడు. ఈ మేరకు బన్నీ తన ట్విట్టర్ లో.." షారుఖ్ జీ.. సో స్వీట్ ఆఫ్ యూ..మీ స్వీట్ మెసేజ్ కి ఆనందంగా ఉంది. లాట్స్ ఆఫ్ లవ్" అంటూ రాసుకొచ్చాడు.






Also Read : కాస్ట్లీ కార్ కొన్న ప్రియమణి - కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!