సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ సినిమా (SSMB29 Movie) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. అది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతారు.


Karthi to play villain role in Mahesh Babu film: 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ దే. ప్రస్తుతం రాజమౌళి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అలానే సినిమాలో నటీనటులను కూడా ఫైనల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో కార్తికి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందని సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో రెండు విలన్ క్యారెక్టర్స్ ఉంటాయట. అందులో ఒక పాత్ర కోసం కార్తిని సంప్రదించినట్లు సమాచారం. 


రాజమౌళి సినిమాలో విలన్ రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. కాబట్టి కచ్చితంగా కార్తి ఒప్పుకోవడం ఖాయం. కానీ ఇందులో ఎంతవరకు నిజముందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కార్తి గతంలో నాగార్జునతో కలిసి 'ఊపిరి' అనే సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కార్తి కూడా ఒక కారణం. ఇప్పుడు మహేష్ తో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారట. అయితే హీరోగా సినిమాలు చేస్తున్న కార్తి విలన్ గా చేస్తారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 


ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో బాలీవుడ్ ముద్దుగుమ్మ రొమాన్స్ చేయబోతోందని తెలుస్తోంది. రాజమౌళి ఫస్ట్ ఆప్షన్ అయితే దీపికా పదుకోన్. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. ఈమెని మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు రాజమౌళి. ప్రస్తుతం దీపికా.. 'ప్రాజెక్ట్ K' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆమెని మహేష్ సినిమా కోసం ఆన్ బోర్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. రాజమౌళి సినిమా అంటే దీపికా నో చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి మహేష్-దీపికా కాంబినేషన్ దాదాపు ఫైనల్ అయినట్లే. 


ఈ సినిమాను కె.ఎల్. నారాయణ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇటు మహేష్, అటు రాజమౌళికి ఆయన ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా చేయడం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నరు. ఆయన ఒక్కరే సోలోగా ప్రొడ్యూస్ చేస్తారా? లేదంటే మరొకరితో కలిసి చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే... రాజమౌళి సినిమా అంటే ప్రొడ్యూస్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. డీవీవీ దానయ్యకు అటువంటి ప్రపోజల్స్ వచ్చినా ఓకే చేయకుండా సోలోగా ప్రొడ్యూస్ చేశారు. 


Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?