నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth kesari) మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ ఎటువంటి కట్స్ లేకుండా జీరో కట్స్ తో సెన్సార్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 'భగవంత్ కేసరి' మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. దసరా కానకగా అక్టోబర్ 19న మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి ఫీవర్ మొదలైపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు సమాచారం. చాలా చోట్ల నుంచి తొలి రోజు కొన్ని షోలకు థియేటర్స్ ఇప్పటికే ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో 'భగవంత్ కేసరి' సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. తాజాగా ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేషన్ వచ్చేసింది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. 'భగవంత్ కేసరి' సినిమా సెన్సార్ కంప్లీట్ అయిందని ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ ప్రకటించింది.
అంతేకాకుండా ఈ మూవీకి U/A వచ్చినట్లు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రంలో ఒక్క కట్ కూడా చేయాలని సెన్సార్ బోర్డు మూవీ టీం కి చెప్పలేదట. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ కంప్లీట్ అయినట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైం 164 నిమిషాల 30 సెకన్లు అంటే దాదాపు రెండు గంటల 44 నిమిషాల 30 సెకన్లుగా ఉంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు అనిల్ రావిపూడి ఇటీవల చెప్పారు. ఆ వాటిని ట్రైలర్ లో ఏమాత్రం చూపించకుండా జాగ్రత్త పడ్డామని థియేటర్స్ లో ఆ సీన్స్ చూసినప్పుడు ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోతారని అన్నారు. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో బాలయ్యను ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించబోతున్నారు అనిల్ రావిపూడి.
అలాగే ఈసారి బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టబోతున్నారు. ఇప్పటికే శాంపిల్ గా ట్రైలర్లో తెలంగాణ స్లాంగ్ లో ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో బాలయ్యకి కూతురిగా శ్రీలీలా కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీతోనే ఆయన టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించగా, రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Also Read : విజయ్ 'లియో'కి ఊహించని షాక్ - తెలుగులో విడుదలపై స్టే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ!