YVS Chowdary About His Movie And Ram Potineni: తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి 'దేవ‌దాస్', 'లాహిరి లాహిరి లాహిరిలో' లాంటి ఎన్నో హిట్ సినిమాలు అందించిన ద‌ర్శ‌కుడు వై వీఎస్ చౌద‌రి. ఎంతోమంది కొత్త హీరోల‌ను సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేసిన ద‌ర్శ‌కుడు. అలాంటిది దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. నంద‌మూరి వార‌సుడు, జాన‌కిరామ్ కొడుకు ఎన్టీఆర్ తో ఆయ‌న సినిమా తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా... ఆసినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించిన వైవీఎస్ చౌద‌రి రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి చాలా ఆవేశంగా స‌మాధానాలు చెప్పారు.


అంద‌రి స‌పోర్ట్ ఉంది.. 


జాన‌కి రామ్ కొడుకు ఎన్టీఆర్ సినిమాల్లోకి  రావ‌డానికి వాళ్ల కుటుంబంలోని ప్ర‌తి ఒక్క‌రి స‌పోర్ట్ ఉంద‌ని వైవీఎస్ చౌద‌రి అన్నారు. కొత్త హీరో కోసం వెత‌క‌డంతో సినిమాలు లేట్ అయ్యాయ‌ని చెప్పారు వైవీఎస్ చౌద‌రి. క‌రోనా రావ‌డం, త‌న క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా కొత్త హీరో దొర‌క‌క‌పోవ‌డం, అమెరికాలో ఉండిపోవ‌డం లాంటి కార‌ణాల వ‌ల్లే ఇన్ని రోజులు సినిమా తియ్య‌లేద‌ని అన్నారు ఆయ‌న‌. ఈ సంద‌ర్భంగా ఒక విలేక‌రి.. కొత్ వాళ్ల‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాను అంటారు కానీ, సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న‌వాళ్ల‌నే ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు అంటూ అడిగిన ప్ర‌శ్నకి ఆయ‌న కొద్దిగా సీరియ‌స్ అయ్యారు. చాలామంది కొత్త వాళ్ల‌ను తాను ఇంట్ర‌డ్యూస్ చేశాన‌ని, ఈ స్టోరీకి ఇత‌నే క‌రెక్ట్ అనిపించాడు కాబ‌ట్టే ఇత‌డిని సెలక్ట్ చేశాను అని అన్నారు వైవీఎస్. 


ప్రొడ్యూస్ చేయ‌డం ఈజీ జాబ్ కాదు..  


వైవీఎస్ చౌద‌రి కేవ‌లం డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాదు. ఆయ‌న ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఈసంద‌ర్భంగా ప్రొడ్యూస‌ర్ గా ఆయ‌న ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను పంచుకున్నాను. "ప్రొడ్యూస్ చేయ‌డం అనేది ఈజీ జాబ్ కాదు. రామ్ మీద పెద్ద బిజినెస్ ఉండ‌దు. రిలీజ్ రోజున రూ.10కోట్లు పొయాయి నాకు. ఆస్తుల‌న్నీ అమ్మే స్టేజ్ లో ఉన్నా. నేను అప్పుడు శాటిలైట్ రైట్స్ త‌క్కువ రేట్ కి అమ్మాను. జీ టీవీ రాఘ‌వ‌రెడ్డిని అడిగితే తెలుస్తుంది. నాలుగు వారాలు థియేట‌ర్లలో జ‌నాలు లేరు. కానీ ఉన్న‌ట్లు ప‌బ్లిసిటీ చేసుకున్నాను. మైకులు ప‌ట్టుకుని మాట్లాడాను. జ‌నాలు బ్ర‌హ్మాండంగా ఉన్నారు అని చెప్పాను. బాగుంది సినిమా అని చెప్పుకున్నాను. జ‌నాల మైండ్‌ను తిప్ప‌డానికి అలా చెప్పాను. విజ‌య‌వంతం చేసినందుకు ఆనందంగా ఉన్నాను అది ఇది అనేవాడిని. కానీ, ప‌రిస్థితి మాత్రం అది కాదు’’ అని తెలిపారు.


‘‘నా విజ‌యాలేవీ ఈజీగా రాలేదు. జ‌న‌వ‌రి 11న 'దేవ‌దాస్' రిలీజ్ అయ్యింది. 12న 'స్టైల్' రిలీజ్ అయ్యింది. 'స్టైల్' లో మాస్ హీరో, సూప‌ర్ హీరో మెగాస్టార్ గెస్ట్ అపియ‌రెన్స్, మ‌రో వైపు నాగార్జున గారు గెస్ట్ అపియ‌రెన్స్. లారెన్స్ 'స్టైల్' వ‌ల్ల నా సినిమా కుదేలు అయిపోయింది. సంక్రాంతికి ల‌వ్ స్టోరీలు చూడ‌రు. నా సినిమా ప‌డుకుంది. 'చుక్క‌ల్లో చంద్రుడు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' యూత్ కూడా నా సినిమాకి రాలేదు. ఇక ఆ త‌ర్వాత 'ల‌క్ష్మీ'. క‌రెక్ట్ పొంగ‌ల్ సినిమా అది. కాలేజీలు తెరిచేశారు. ఎవ్వ‌రూ నా సినిమాకి రాలేదు. డిస్ట్రిబ్యూట‌ర్లు ట‌ర్మినేష‌న్ లెట‌ర్లు ఇచ్చేశారు. అక్క‌డ నుంచి త‌క్కువ డ‌బ్బుల‌కి జీ టీవీకి అమ్మేశాను. నాలుగు వారాల త‌ర్వాత పిక‌ప్ అయ్యింది. హిస్ట‌రీ 15 సెంట‌ర్లు 175 డేస్ ఆడింది అంటూ" త‌న అనుభ‌వాలు పంచుకున్నారు వైవీఎస్. 'లాహిరి లాహిరి లాహిరిలో' కూడా అంత ఈజీగా ఏమి హిట్ కాలేద‌ని అన్నారు. దాంట్లో అంద‌రూ ఫేడ్ ఔట్ అయిన యాక్ట‌ర్ల‌ను పెట్టుకున్నానని.. కొత్త వాళ్ళు వున్నారని ఆడలేదు. అప్పుడు రామోజీ రావు గారి వ‌ల్ల సినిమా ఆడింది’’ అంటూ చెప్పారు వైవీఎస్. 


Also Read: నందమూరి కుటుంబం నుంచి మరో హీరో - 9 ఏళ్ల తర్వాత మళ్లీ మైక్ పట్టిన వైవీఎస్ చౌదరీ