Aishwarya Arjun - Umapathy Ramaiah Pre Wedding: కోలీవుడ్‌లో పెళ్లి సందడి మొదలయ్యింది. యాక్షన్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య, మోస్ట్ వాంటెడ్ సీనియర్ కామెడియన్ రామయ్య కుమారుడు ఉమాపతి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. గతేడాది ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్య ఎంగేజ్‌మెంట్ జరిగింది. అప్పటికీ పెళ్లి డేట్ గురించి ఇరు కుటుంబాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా జూన్ 14న వీరిద్దరి పెళ్లి జరగనుందని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇక పెళ్లి డేట్ దగ్గర పడుతుండడంతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సింపుల్ థీమ్..


చెన్నైలోనే ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్య మెహెందీ, హల్దీ వేడుకలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రేక్షకులంతా ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు. వైరల్ అవుతున్న మెహందీ ఫోటోల్లో ఉమాపతి రామయ్య డార్క్ మెరీన్ షర్వానీ ధరించాడు. ఐశ్వర్య.. అనామిక ఖన్నా డిజైన్ చేసిన యెల్లో డ్రెస్‌లో అందంగా మెరిసిపోయింది. హల్దీలో దాదాపుగా ఫ్యామిలీ అంతా వైట్ డ్రెస్‌లో సింపుల్‌గా రెడీ అయ్యారు. ‘కవర్ మీ ఇన్ సన్‌షైన్’ అనే థీమ్‌తో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. మెహందీ ఫంక్షన్ కూడా చెన్నైలోని అర్జున్ ఇంట్లోనే జరిగింది.






గెస్ట్‌గా విశాల్..


ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో అర్జున్, ఐశ్వర్యల బాండింగ్ చూసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. 2013లో ‘పట్టత్తు యానై’లో అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ఐశ్వర్య. ఈ మూవీ హీరో విశాల్ కూడా ఐశ్వర్య, ఉమాపతి హల్దీ, మెహెందీ ఫంక్షన్స్‌లో పాల్గొన్నాడు. నా ప్రియమైన ఐషు, ఉమాపతి సంగీత్‌కు అంతా సిద్ధం’ అంటూ బ్లూ కలర్ కుర్తా వేసుకున్న తన ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు విశాల్. 2021లో బుల్లితెరపై నిర్వహించిన ఒక షోలో ఐశ్వర్య, ఉమాపతి కలిశారు. వెంటనే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమలో పడిన ఈ ఇద్దరు.. ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించారు.






హీరోహీరోయిన్లుగా ప్రయత్నాలు..


ఐశ్వర్య అర్జున్ చివరిగా తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సొల్లివిడవ’ అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. అర్జున్ లాంటి సీనియర్ హీరో కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కూడా హీరోయిన్‌గా ఐశ్వర్యకు అంతగా సక్సెస్ లభించలేదు. ఇక ఉమాపతి విషయానికొస్తే.. తన తండ్రి తంబి రామయ్య యాక్టర్‌గా, డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో మంచి గుర్తింపును సాధించారు. అలాగే తన కుమారుడు ఉమాపతిని కూడా సక్సెస్‌ఫుల్ హీరోగా చూడాలనుకున్నారు. 2017లో ‘అధగపట్టతు మగజనంగలయ్’లో హీరోగా డెబ్యూ చేశాడు ఉమాపతి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ పలు చిత్రాల్లో హీరోగా ప్రేక్షకులను అలరించాడు. 2021లో విడుదలయిన ‘తాన్నే వంది’.. హీరోగా ఉమాపతి రామయ్య చివరి చిత్రం.


Also Read: యంగ్ హీరోతో సోనాక్షి సిన్హా పెళ్లి - ఇన్విటేషన్ కూడా రెడీ