కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కంగువ'. సూర్య కెరీర్లో 42వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సూర్య ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో నుంచి రెండో పాట 'యోలో'ను రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. 


ఫుల్ పార్టీ మోడ్ లో 'యోలో' సాంగ్ 
సూర్య హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ పీరియాడిక్ డ్రామా 'కంగువ'. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రానికి స్టూడియో గ్రీన్ - యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'కంగువ' సినిమాను నవంబర్ 14న తెలుగు, తమిళ భాషలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మూవీని ఏకంగా 10 భాషలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నుంచి మొదటి సాంగ్ 'ఫైర్'ను రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమాలో నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ సాంగ్ ఫుల్ పీరియాడిక్ యాక్షన్ మోడ్ లో ఉంటే, ఈ రెండవ సాంగ్ మాత్రం కంప్లీట్ గా పార్టీ మూడ్ లో ఉంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ తో పాటు లవిత లోబో పాడగా, వివేకా లిరిక్స్ అందించారు. ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా ఉన్న ఈ క్యాచీ సాంగ్ వింటే పూనకాలు రావడం ఖాయం. అలాగే విజువల్ గా ఈ లిరికల్ సాంగ్  అదిరిపోయింది. అంతేకాదు సూర్య అల్ట్రా స్టైలిష్ మోడ్ లో అద్భుతంగా కన్పిస్తున్నాడు. ఇప్పటి నుంచి ఎక్కడ ఏ పార్టీ జరిగినా ఈ ;యోలో' సాంగ్ తో మోత మోగడం ఖాయం.



సపరేట్ గా మ్యూజికల్ ఈవెంట్  
కాగా మూవీ మ్యూజికల్ ఈవెంట్ ను అక్టోబర్ 26న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.  ఇప్పుడైతే ప్రమోషన్స్ లో భాగంగా నార్త్ ఇండియా టూర్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీలో 'కంగువ' సందడి చేయగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ కాలేజ్ గ్రౌండ్ లో ప్రమోషనల్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా, అక్కడికి మూవీ లవర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఈ ఈవెంట్లో సూర్యతో పాటు దిశా పటాని, బాబి డియోల్ పాల్గొన్నారు. 'కంగువ'ను కేవలం పాన్ ఇండియా భాషలోనే కాకుండా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ తో సహా ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయబోతుండడం అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా రిలీజైన సాంగ్ మరింత జోష్ ను పెంచేసింది. 




Read Also: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ