Naga Chaitanya Wedding Perps : అక్కినేని వారసుడు నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగగా, తాజాగా పెళ్లి పనులు షురూ అయ్యాయి. శోభితా ఈ విషయాన్ని తెలియజేస్తూ తను పసుపు దంచుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చై-శోభిత పెళ్లి పనులు షురూ...
అక్కినేని నాగ చైతన్య - ధూళిపాళ్ల ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు ? అన్న విషయం మూవీ లవర్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ జంట ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి పెళ్లి గురించి ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. అయితే ఈ విషయాన్ని నాగార్జున ఫ్యామిలీ ఇంకా ప్రకటించలేదు కానీ తాజాగా పెళ్లి పనులను మొదలుపెట్టారు ఇరుకుటుంబ సభ్యులు. అందులో భాగంగానే తెలుగు వివాహాలలో ముఖ్యమైన ఆచారంగా భావించే పసుపు లేదా హల్దీ వేడుకలు స్టార్ట్ అయ్యాయి. ఈ వేడుకల్లో ధూళిపాళ్ల పాల్గొంది. తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కూడా హాజరైన ఈ వేడుకలో శోభిత ప్రత్యేకలు పూజలు చేస్తూ, పసుపు దంచుతూ కనిపించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పెళ్లి తేదీని ఇంకా వెల్లడించలేదు.
పెళ్లి వేదిక ఇదేనా?
అయితే అంతకంటే ముందే నాగార్జున చై-శోభిత ఎంగేజ్మెంట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడు ఈ జంట ప్రైవేట్ గానే పెళ్లి వేడుకలు జరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గత కొంతకాలం నుంచి ఈ జంట డిసెంబర్లో ఉదయ్ పూర్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలు పెట్టారు. 2022 నుంచి ఈ జంట డేటింగ్ చేస్తుండగా, ఈ ఏడాది ఆగస్టులో శోభిత ధూళిపాళ్ల - నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
అంతకుముందు నుంచే వీరిద్దరూ ప్రేమాయణం నడిపిస్తున్నారు అంటూ రూమర్లు వినిపించగా, సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శోభిత సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్ రిచువల్స్ జరుగుతున్న ఫోటోలను షేర్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక రీసెంట్ గా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట స్టైలిష్ లుక్ లో అదర గొట్టిన పిక్ ఒకటి నెట్టింట హల్చల్ చేసింది. చైతన్య ఆ ఫోటోను సోషల్ మీడియాలో స్వయంగా పోస్ట్ చేశారు. అంతలోనే వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి అన్న గుడ్ న్యూస్ అక్కినేని అభిమానుల్లో జోష్ పెంచింది. కానీ పెళ్లి ఎప్పుడు అన్న విషయాన్ని అయినా ముందుగా ప్రకటిస్తారా? లేదంటే ఎంగేజ్మెంట్ లాగే అంతా అయిపోయాక ఫోటోలతో తీపి కబురును చేదుగా చెబుతారా? అనేది కన్ఫ్యూజన్ నెలకొంది చై ఫ్యాన్స్ లో. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ చైతన్య 'తండేల్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.