'ధురంధర్‌'లో 'రెహమాన్ డెకాయిట్' పాత్ర అయినా... 'రెయిడ్ 2'లోని విలన్ 'దాదా భాయ్' పాత్ర అయినా... 2025లో విడుదలైన హిందీ సినిమాల్లో విలన్లదే హవా. పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్స్‌ పవర్ ఫుల్ రోల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హిందీలో ఈ ఏడాది హీరోల కంటే విలన్లకు ఎక్కువ పేరు వచ్చింది. అసలు ఆ హీరోలు ఎవరు? ఏయే సినిమాల్లో ఎవరెవరి విలనిజం హిట్ అయ్యింది? అనేది చూడండి. 

Continues below advertisement

ఈ ఏడాది (2025లో) అక్షయ్ ఖన్నా రెండు సినిమాల్లో నెగటివ్ పాత్రలు చేశారు. సంజయ్ దత్, జూనియర్ ఎన్టీఆర్, బాబీ డియోల్, రణదీప్ హుడా వంటి స్టార్స్ కూడా భయంకరమైన విలన్ పాత్రలతో స్క్రీన్‌పై విలనిజం పండించారు. హీరోల కంటే విలన్లే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే... 2025లో విలన్లు కేవలం భయపెట్టడానికే పరిమితం కాలేదు, వారి నటన సినిమాలకు ప్లస్ అయ్యింది. ప్రేక్షకులు ఈ విలన్లపై హీరోల మాదిరిగానే ప్రేమను కురిపించారు.

'ఛావా'లో ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నాఫిబ్రవరి 14న విడుదలైన విక్కీ కౌశల్ - రష్మికల పీరియడ్ డ్రామాలో అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి 'ఔరంగజేబు'గా క్రూరమైన పాత్రను పోషించారు అక్షయ్ ఖన్నా. అతని నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్ అయింది.

Continues below advertisement

'జాట్'లో రణదీప్ హుడాటాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన హిందీ సినిమా 'జాట్'. ఏప్రిల్ 10న విడుదలైందీ సినిమా. సన్నీ డియోల్ హీరోగా నటించగా... 'జాట్'లో రాణతుంగ అనే భయంకరమైన విలన్ పాత్రను పోషించారు రణదీప్ హుడా. అతని క్రూరమైన అవతారం, నటన ప్రశంసలు అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతాలు సృష్టించడంలో సఫలమైంది.

Also Read: Avatar Fire And Ash Telugu Review - 'అవతార్ 3' రివ్యూ: ఇండియన్ ఫ్యామిలీ ఎమోషన్స్ & వరల్డ్ క్లాస్ విజువల్స్... జేమ్స్ కామెరూన్ ఎలా తీశారంటే?

'రెయిడ్ 2'లో రిషబ్ విలనిజం!మే 1న థియేటర్లలో విడుదలైన అజయ్ దేవగన్ సినిమా 'రెయిడ్ 2'. అద్భుతమైన కథ, స్టార్ యాక్టర్స్‌ మధ్య విలన్ పాత్రలో మరింత ప్రత్యేకంగా నిలిచాడు రితేష్ దేశ్‌ముఖ్. కామెడీ సినిమాల్లో నటించి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన ఆయన, కేంద్ర మంత్రి దాదా మనోహర్ భాయ్ - నెగటివ్ పాత్రలో సందడి చేశారు. సినిమాలో అతని నటన, డైలాగులతో పాటు అతని స్టైల్ కూడా బాగా ప్రశంసలు అందుకుంది.

హౌస్‌ఫుల్ 5... ఫర్దీన్ ఖాన్మల్టీస్టారర్ సినిమా 'హౌస్‌ఫుల్ 5'లో ఫర్దీన్ ఖాన్ విలన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతని పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. జూన్ 6న విడుదలైన కామెడీ సినిమాలో ఫర్దీన్ ఖాన్ సర్ప్రైజ్ విలన్ 'దేవ్ డోబ్రియాల్' పాత్రను పోషించాడు, ఇది క్లైమాక్స్‌లో రివీల్ అవుతుంది.

'వార్ 2'లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్హిందీ చిత్రసీమకు టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పరిచయమైన సినిమా 'వార్ 2'. దీనికి ముందు 'ఆర్ఆర్ఆర్'తో నార్త్ ఇండియాలోనూ హిట్ కొట్టినా... ఈ సినిమా ఆయనకు ఫస్ట్ బాలీవుడ్ ఫిల్మ్స్‌. ఇందులో హృతిక్ రోషన్ హీరో. జూనియర్ ఎన్టీఆర్ యాంటీ హీరో. ఈ స్పై-థ్రిల్లర్ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటెన్స్ యాక్టింగ్ ఆకట్టుకుంది. సినిమాలో ట్విస్ట్‌లు, డైలాగులతో పాటు ఆయన స్టైల్, నటనకు పేరు వచ్చింది.

'బాఘీ 4'లో సంజయ్ దత్సెప్టెంబర్ 5న థియేటర్లలో వచ్చిన టైగర్ ష్రాఫ్ యాక్షన్ సినిమా 'బాఘీ 4'. ఇందులో సంజయ్ దత్ 'చాకో' అనే భయంకరమైన విలన్ పాత్రను పోషించాడు. అతని భయంకరమైన లుక్, నటన ప్రశంసలు అందుకున్నాయి.

'థామా'లో నవాజుద్దీన్ సిద్ధిఖీఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న నటించిన హారర్ కామెడీ సినిమా 'థామా'. అందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్. 'యక్షాసన్' అనే భయంకరమైన విలన్ పాత్రలో కనిపించాడు. అతని కొత్త అవతారం, నటన ప్రేక్షకులకు నచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 21న విడుదలైంది.

'ధురంధర్'లో అక్షయ్ ఖన్నాను మరువగలమా?ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్ సినిమాలలో 'ధురంధర్' ఒకటి. అందులో విలన్ అంటే 'రెహమాన్ డకాయిట్'గా నటించిన అక్షయ్ ఖన్నా గుర్తుకు వస్తారు. హీరో రణవీర్ సింగ్ కంటే ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది.

ఈ సినిమాలే కాకుండా... 'జ్వెల్ థీఫ్'లో జయదీప్ అహ్లావత్ క్రూరమైన మాఫియా పాత్రను అద్భుతంగా పోషించాడు. ఆర్యన్ ఖాన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'లో బాబీ డియోల్ 'అజయ్ తల్వార్' అనే డార్క్ పాత్రను పోషించాడు.