తుఫాన్... యష్ 'తుఫాన్' వచ్చింది. మీరు విన్నారా? చూశారా? ఆలస్యం చేయకుండా త్వరగా వినండి మరి! కన్నడ స్టార్ హీరో యష్ నటించిన లేటెస్ట్ సినిమా 'కె.జి.యఫ్: చాఫ్టర్ 2'. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కె.జి.యఫ్: చాఫ్టర్ 1'కు సీక్వెల్ ఇది. ఈ సినిమాలో సాంగ్ 'తుఫాన్'ను నేడు విడుదల చేశారు.


'జల్లెడ పడితే ఒక్కడు కూడా నిలబడడు. ఇలాంటి ధైర్యం లేని జనాల్ని పెట్టుకుని వీడేం చేస్తాడు?' -  'తూఫాన్' లిరికల్ వీడియోలో మొదట వినిపించిన డైలాగ్.


'అవును సార్! మీరు అన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకమూ ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది. కానీ, ఒకడు అడ్డం నిలబడ్డాడని... కాళీ ముందు వాడి తల నరికాడు కదా! ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేశాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి ప్రతి ఒక్కడికీ ఊపిరి ఇచ్చింది. మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మాత్రం అతడికి అడ్డు నిలబడకండి సార్" అని బదులు వచ్చింది.


'కె.జి.యఫ్: చాఫ్టర్ 1'లో పతాక సన్నివేశాలను గుర్తు చేస్తూ... పాట ప్రారంభంలో డైలాగులు వినిపించారు. ఆ తర్వాత 'తూఫాన్' సాంగ్ మొదలైంది. రవి బసురూర్ సంగీతం అందించిన ఈ పాటకు తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: నాగచైతన్యను ఫాలో అవ్వడం మానేసిన సమంత
Also Read: థియేట‌ర్ల‌లో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఎదురులేదు. మ‌రి, ఓటీటీల్లో? - ఈ వారం విడుదలవుతున్న చిత్రాలు ఇవే