Paruchuri Gopala Krishna Talk about Eagle Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమేని తెరకెక్కించిన చిత్రం ఈగల్. ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అనుపమ పరమేశ్వరన్, కావ్యాథాపర్ హీరోయిన్లు కాగా నవదీప్, అవసరాల శ్రీవాస్‌లు కీలక పాత్రలు పోషించారు ఈ మూవీ నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈగల్ అమెజాన్ ప్రైం, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఆ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూ ఇచ్చారు. ఈగల్ సినిమాను క్షణంగా చూస్తే అర్థం అవుతుందన్నారు. "కొన్ని సినిమాలు కాసేపు చూడగానే కట్టేయాలి అనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు ఇందులో ఏముందా? అని తెలుసుకోవాలని అనిస్తుంది. కానీ ఈ సినిమా అరెస్టింగ్‌గా ఉంది.
అంటే కళ్లు కూడు తిప్పుకొనివ్వలేదు. రైతు కష్టాలు(పత్తి రైతులు) అనే అద్బుతమైన కథను తీసుకున్నాడు. ఫస్ట్ నేను ఈ సినిమా హీరో రైతు అనుకున్నాను. కానీ కాదు. రైతు సమస్య అనే పాయింట్‌కు ఇంటర్నేషనల్ మాఫియా జోడించి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. కొన్ని చోట్ల స్క్రిన్‌ప్లే ఫాస్ట్‌గా చూపించాడు. ఇందులో మాఫియాను ప్రధాన అంశంగా తీసుకున్నాడు. రవితేజ బాడీ లాంగ్వెజ్, లుక్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌లో ఎక్కువగా మారణాయిధాలు వాడారు. ఈ సినిమా థీమ్ ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణమైనటువంటి పాయింట్. రైతు సమస్యలు, పత్తిపంట, మరణాయుధాలు సమస్యలుగా అలాగే ఉన్నాయి. ఒక మాస్ హీరోతో హాలీవుడ్ రేంజ్‌లో మారణాయుధాలు వాడి కథ, కథనాలు ఆ విధంగా తీర్చిదిద్దారు. అలా కథను తీసుకువెళ్లటప్పుడు ఆడియన్స్ డిస్ట్రర్బ్ అయే అవకాశం ఉంది.
కానీ కార్తిక్ ఘట్టమనేని అలాంటిది లేకుండ కథ, స్క్రిన్‌ప్లే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లాడు. అందుకే కొన్నిచోట్ల స్క్రీన్‌ప్లే స్పీడ్‌గా తీసుకువెళ్లాడు. నవదీప్ పాత్ర కన్‌ప్యూజింగ్‌గా ఉంది. ఒకచోట గడ్డం, ఒకచోట గడ్డం లేకుండ కనిపించాడు. అలా వెళుతున్న సినిమాలో ప్రేమకథ లోపించింది అని అనుకుంటుండగా అప్పుడు లవ్‌స్టోరీ మొదలైంది. అంటే సినిమా మొదలైన గంట నలభై నిమిషాల వరకు లవ్‌స్టోరీ లేదు. అప్పటిదాక సినిమానలు నడిపంచడమంటే నిజంగా ఇది డైరెక్టర్ సాహసమనే చెప్పాలి. అప్పటిదాగా ఇతర పాత్రలతో కథను నడిపించాడు. ప్రస్తుతం యూత్‌కి కామెడీ, ప్రేమ కావాలి. ఈ రెండు లుకుండా సినిమాని దర్శకుడు తెరకెక్కించిన విధానం చాలా బాగుతుంది. ఈ సినిమాలో కామెడీ లేదని కాదు ఉంది. ఉంది కానీ, మరి అంత కాదు. విలన్ గ్యాంగ్‌తో దర్శకుడు వినోదాన్ని రాబట్టాడు. అలాగే ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీని పరిచయం చేశాడు. ఇక్కడ హీరోని అసలు హీరోయిన్ చూడకుండానే హీరోతో లవ్ సీన్ చేయించాడు. ఈ పాయింట్ హాలీవుడ్ కథలో ఉంది. ఆ హీరోయిన్ హీరోని అసలు పట్టించుకోదు.
Also Read: శపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?
కానీ ఆమెను హీరో చూస్తాడు, లవ్ చేస్తాడు. ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో కొండ, తవ్వకాలు అని చెప్పాగానే కొందరు వణికిపోతారు. మొదట్లోనే ఈసీన్‌ని డైరెక్టర్ అద్భుతంగా చూపించాడు.'కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి' అనే ఆ డైలాగ్ బాగుంది. ఇందులో ఫిజికల్ ఫైట్స్ కంటే గన్స్ చాట్స్ ఎక్కువగా వాడారు. అంత వాయిలెన్స్ లేకుండ ఉండాల్సింది అనిపించింది. కానీ, మొత్తానికి ఈగల్ సినిమా కుణ్ణంగా చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ఏమాత్రం సినిమా నుంచి డిస్ట్రాక్ట్ అయినా, దృష్టి కేంద్రికరించకపోయినా సినిమా అర్థం కాదు. ఇప్పటి డైరెక్టర్ తెలుసుకోవాల్సి విషయం ఏంటంటే ఓ వర్గం ఆడియన్స్‌కి కామెడి కావాలి, ఓ వర్గం ఆడియన్స్‌కి ఎమోషన్ కావాలి, ఓ వర్గం ఆడియన్స్‌కి మాస్ కావాలి, మరో వర్గం ప్రేక్షకులు కన్నీళ్లు కావాలి.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ కథ రాసుకుని స్క్రిన్‌ప్లే నడిపిస్తే మూవీ రెట్టింపు ఫలితం ఇస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.