Kannappa First Half Review: 'కన్నప్ప' ఫస్టాఫ్ చూసిన రైటర్ బీవీఎస్ రవి - విష్ణు మంచు సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
BVS Ravi on Kannappa: డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న మైథలాజికల్ సినిమా 'కన్నప్ప'. ఏప్రిల్ 25 ను విడుదల కానున్న ఈ సినిమా ఫస్టాఫ్ రెడీ అయ్యింది. అది చూసిన బివిఎస్ రవి ఏమన్నారో తెలుసా?

Kannappa Movie First Review: డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు కథానాయకుడిగా రూపొందుతున్న మైథాలజికల్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'కన్నప్ప'. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందుకని ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ సినిమా ఫస్టాఫ్ పూర్తి అయ్యింది. ప్రముఖ రచయిత బివిఎస్ రవి చూశారు కూడా! మరి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'కన్నప్ప' ఫస్టాఫ్ చూశా... అదిరిపోయింది!
తనయుడు విష్ణు మంచు టైటిల్ పాత్రలో లెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు 'భక్త కన్నప్ప' సినిమాను మళ్లీ తీస్తున్నారని, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నుంచి మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరకు భారీ తారాగణం ఈ సినిమాలో ఉందని, అది చాలా భారీ బడ్జెట్ సినిమా అని రచయిత బివిఎస్ రవి తెలిపారు. ''విష్ణు హీరోగా ప్రొడ్యూస్ చేస్తున్న కన్నప్ప సినిమా చాలా హై బడ్జెట్ ఫిలిం. నేను సినిమా చూశాను అండి. అదిరిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది రికార్డ్ అవుతుంది కదా! ఆన్ రికార్డ్ చెబుతున్నాను... ఫస్టాఫ్ చూశా. అదిరిపోయింది'' అని బివిఎస్ రవి తెలిపారు.
మంచు కుటుంబానికి బివిఎస్ రవి ఇచ్చిన రివ్యూ బోలెడంత బూస్ట్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆల్రెడీ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు విష్ణు మంచు. దేశంలోని వివిధ నగరాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 3వ తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్!
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పరమశివుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సందడి చేయనున్నారు. ఆయనకు జంటగా పార్వతీదేవి పాత్రలో చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. పరమశివునికి నమ్మిన బంటుగా నంది పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించారని సమాచారం. ఫిబ్రవరి 3వ తేదీన సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ వెల్లడించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నారు.