Thandel Censor Review: 'తండేల్'కు యు/ఎ సర్టిఫికెట్... సెన్సార్ సభ్యులు ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
Thandel Censor Report: యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కలయికలోని 'తండేల్' సెన్సార్ పూర్తి అయ్యింది. మరి, సెన్సార్ సభ్యుల నుంచి ఎటువంటి రిపోర్ట్ వచ్చిందో తెలుసా?

Thandel movie completed its censor formalities: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'తండేల్'కు అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో చాలా పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మరి, సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందో తెలుసా?
బ్లాక్ బస్టర్ 'తండేల్'... అందులో నో డౌట్!
Thandel Movie First Review: థియేటర్లలో విడుదలకు వారం రోజుల ముందు 'తండేల్' సెన్సార్ పూర్తి అయింది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అయితే 'బ్లాక్ బస్టర్' అంటూ ఒక్క ముక్కలో తమ తీర్పు ఇచ్చేశారని తెలిసింది.
Thandel Movie Runtime: 'తండేల్' సినిమా రన్ టైమ్ కూడా తక్కువ. యాడ్స్ గట్రా కలిపితే 2.32 గంటలు. దేశభక్తి కథకు యాక్షన్, ఎమోషన్స్ జోడించి చందూ మొండేటి సినిమాను క్రిస్పీగా తీశారని సెన్సార్ టీమ్ చెబుతోంది.
'తండేల్' కథ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒకటైన శ్రీకాకుళం నుంచి కొందరు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళతారు. పాకిస్తాన్ సైన్యం చేతికి వాళ్ళు చిక్కడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా తీశారు. కథ ప్రేక్షకులకు తెలిసినప్పటికీ... ఆయన తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుందని, హృదయాలను హత్తుకునే విధంగా భావోద్వేగాలని మలిచారని సెన్సార్ సభ్యుల నుంచి రిపోర్ట్ అందుతుంది.
'తండేల్'ను వాస్తవికతకు దగ్గరగా, ప్రతి ఒక్కరి మనసులను కదిలించే సహజమైన భావోద్వేగాలతో సినిమా తీశారని ప్రశంసలు లభిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి పాకిస్తాన్ వరకు వెళ్లి ఆ తర్వాత ఇండియా వచ్చిన మత్స్యకారుల కథలో దేశభక్తి ఉందని, అంతకు మించి ఎమోషన్స్ ఉన్నాయని ఎర్లీ రిపోర్ట్స్ బట్టి తెలుస్తోంది.
అల్లు అరవింద్ మెచ్చిన 'తండేల్'... ఆయన రివ్యూ తెల్సా?
'తండేల్' సెన్సార్ పూర్తి కావడానికి ముందు ఎడిటింగ్ రూంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సినిమా చూశారు. ఆయనకు సినిమా విపరీతంగా నచ్చిందని బన్నీ వాసు చేసిన ట్వీట్ ద్వారా అర్థం అవుతోంది. అల్లు యూనివర్సిటీ డీన్ పెట్టిన పరీక్షలో తమ సినిమా డిస్టింక్షన్ లో పాస్ అయ్యిందని బన్నీ వాసు పేర్కొనగా... 'తండేల్'కు అల్లు అరవింద్ 100 కు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది.
నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆయన స్వరపరిచిన పాటల్లో 'బుజ్జి తల్లి', 'నమో నమః' మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవల విడుదలైన 'హైలెస్సో హైలెస్సా' కూడా ట్రెండ్ అవుతుంది. తెలుగుతో పాటు ఫిబ్రవరి 7న తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.